మధుమేహాన్ని అదుపులో ఉంచే ఆహారం!

మధుమేహం దీర్ఘకాలిక సమస్య. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మధుమేహ బాధితులు ఉన్నారు. ప్రతి సంవత్సరం మధుమేహ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది జన్యుసంబంధ వ్యాధి కావడంతో వారసత్వంగా వస్తుంది. దీనివల్ల చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ వ్యాధి శరీరాన్ని లోపలి నుంచి విచ్ఛిన్నం చేస్తుంది. ఇది చాలా అవయవాలపై చెడు ప్రభావం చూపుతుంది. దీన్ని సమూలంగా నివారించడం కష్టం. షుగర్​ లెవల్స్​ని కంట్రోల్​లో ఉంచుకుంటూ జాగ్రత్తపడాల్సిందే. రక్తంలో చక్కెర శాతాన్ని, శరీరంలో ఇతర హార్మోన్లను సమాంతరంగా ఉత్పత్తి చేయడానికి ఇన్సులిన్ సాయపడుతుంది. శరీరంలో ఇన్సులిన్ ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమే. ఇన్సులిన్ తక్కువైతే డయాబెటిస్ (షుగర్), ఎక్కువైతే టైప్2 డయాబెటిస్ వస్తాయి. అందుకే ఇన్సులిన్ ను బ్యాలెన్స్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. శరీరంలో ఇన్సులిన్​ను బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలేవో తెలుసుకుందాం..
* పచ్చి కొబ్బరి ముక్కల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది ఇన్సులిన్​ను తగ్గించడానికి సాయపడుతుంది. కొబ్బరిలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి తినడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్​లో ఉంటుంది. నేరుగా కొబ్బరి ముక్కలే కాకుండా కొబ్బరి నూనె, కొబ్బరి పాలను తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
* మొలకెత్తిన గింజలు శరీరంలో పోషకాలను పెంచుతాయి. ముఖ్యంగా బీన్స్ మొలకల్లో ప్రొటీన్స్, యాంటీఆక్సిడెంట్స్ శాతం ఎక్కువ. ఇవి ఇన్సులిన్ ను మెరుగుపరచడంలో సాయపడుతాయి. రోజూ ఉదయాన్నే గుప్పెడు మొలకలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. గ్యాస్టిక్​ ట్రబుల్​ ఉన్నవాళ్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి.
* అవిసె గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా అవిసెల్లోని ప్రోబయాటిక్​ లక్షణాలు రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని తగ్గిస్తాయి. వీటిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సాయపడే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ ఉంటుంది. అందుకే పోషకాలు అధికంగా ఉండే అవిసె గింజలతో పెరుగును కలిపి తింటే చాలా మంచిది.
* బాదం గింజలను నానబెట్టి తొక్కతీసి వెన్నతో కలిపి తినడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం పెరుగుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను తగ్గిస్తుంది. రోజూ నాలుగు బాదం పలుకులను వెన్నతో కలిపి తినాలి. ఎక్కువ మోతాదులో తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
* చిరు ధాన్యాలు ఒక్కోటి 2 రోజుల చొప్పున తీసుకోవాలి. అంటే ఊదలు, అరికలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు వంటివి తినాలి. చిరుధాన్యాలతో అన్ని రకాల అల్పాహారం చేసుకుని ఆరగించవచ్చు. రాత్రి భోజనం రాగులు, జొన్నలు, సజ్జలతో చేసుకుని తినడం మంచిది.