Spiritual: ఉప‌వాస స‌మ‌యంలో ఇవి తిన‌కండి

మామూలు రోజుల్లో పెద్ద‌గా ఆక‌లి వేయ‌దు కానీ.. ఉప‌వాసం (fasting) ఉన్న‌ప్పుడు మాత్రం విప‌రీతంగా ఆకలి వేసేస్తుంది. అలాంట‌ప్పుడు ఏది ప‌డితే అది తినాల‌ని మ‌న‌సు లాగేస్తుంటుంది. ఫాస్టింగ్‌లో ఉన్న‌ప్పుడు కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు తిన‌కూడ‌దు. అవేంటో తెలుసుకుందాం. (spiritual) ఉప‌వాసంలో రెండు ర‌కాలు. ఒక‌టి క‌టిక ఉప‌వాసం.. మ‌రొక‌టి మామూలు ఉప‌వాసం. క‌టిక ఉప‌వాసం అంటే.. నీళ్లు కూడా తాగ‌కుండా ఉంటారు. మామూలు ఉప‌వాసం అయితే మ‌ధ్య‌లో పాలు, పండ్లు లాంటివి తీసుకుంటూ ఉంటారు. మీరు మామూలు ఉప‌వాసం చేయాల‌నుకుంటే ఎక్కువ‌గా ఆక‌లి వేయ‌కుండా చేసే ప‌దార్థాల‌ను ఎంచుకుంటే మంచిది.

ఏవి తినాలి?

పాల ప‌దార్థ‌లు ఎక్కువ‌గా తీసుకోండి. ఇవి క‌డుపు నిండుగా ఉండేలా చేస్తాయి కాబట్టి అంత‌గా ఆక‌లి వేయ‌దు.

మీకు న‌చ్చిన పండ్ల‌ను కూడా తీసుకోవ‌చ్చు. నీటి శాతం ఎక్కువ‌గా ఉండే పుచ్చ‌కాయ, యాపిల్స్ వంటివి తీసుకుంటే క‌డుపు నిండుగా ఉంటుంది. (spiritual)

సాబూదానా కిచిడి లాంటివి కూడా తీసుకోవ‌చ్చు. కాక‌పోతే అందులో అల్లం, వెల్లుల్ని, ఉల్లిపాయ లాంటివి వేసుకోకూడ‌దు.

ఏవి తిన‌కూడ‌దు

ఉప‌వాసం స‌మ‌యంలో ఏం తిన‌కూడ‌దు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి అస్స‌లు తీసుకోకూడ‌దు. కాఫీ, టీలు కూడా తీసుకోకండి. దాని వ‌ల్ల ఆక‌లి ఎక్కువ అవుతుంది. ఇంకా డీహైడ్రేషన్ వ‌స్తుంది. దాని వ‌ల్ల క‌ళ్లు తిరిగి ప‌డిపోయే ప్ర‌మాదం ఉంది. (spiritual)