Sravana Masam: ముఖ్యమైన పండుగలు
Hyderabad: శ్రావణ మాసం (sravana masam) జులై నెలలోనే మొదలైపోయింది. కాకపోతే అసలైన శ్రావణ మాసం మొదలయ్యేది ఈ నెల 17న. పైగా ఈ శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈసారి శ్రావణ మాసం 59 రోజులు ఉండబోతోంది. అంటే ప్రతి సంవత్సరం నాలుగు శ్రావణ సోమవారాలే వస్తాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం 8 సోమవారాలు ఉండబోతున్నాయి. ఇలా దాదాపు 19 ఏళ్ల తర్వాత జరగడం ఎంతో ప్రత్యేకం. అధిక మాసం రెండు సార్లు రావడం వల్ల శ్రావణ మాసం (sravana masam) 58 రోజుల పాటు ఉంటుంది.
ఈ శ్రావణ మాసంలో పండుగలు ఏంటో చూద్దాం
ఆగస్ట్ 20 – నాగుల చవితి
ఆగస్ట్ 21 – నాగుల పంచమి
ఆగస్ట్ 22 – కొత్తగా పెళ్లి అయిన స్త్రీలతో మంగళ గౌరి వ్రతం చేయిస్తారు
ఆగస్ట్ 25 – వరలక్ష్మి వ్రతం
శ్రావణ మంగళవారముల్లో వ్రతం చేయిస్తే ఇష్టాలు తీరి కష్టాలు తొలగిపోతాయట. ఇక శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి ఇలవేల్పుని పూజించాలి. చలిమిడి ముద్దతో దీపాలు తయారుచేసి వాటిలో ఆవు నెయ్యి వేసి దీపాలు పెట్టి పూజ చేయాలి. ఓపిక ఉంటే ఆ రోజంతా ఉపవాసం చేయండి. ఆ తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో దీపం పెట్టి ఐదుగురు ముత్తైదువులను పిలిచి తాంబూళం ఇస్తే ఎంతో మంచిది. (sravan masam)