Festivals: సెప్టెంబ‌ర్‌లో రాబోయే పండుగ‌లు ఇవే..!

ఎన్ని పండుగ‌లు వ‌చ్చినా దేశ‌వ్యాప్తంగా అంతా ఎదురుచూసేది బొజ్జ‌గ‌ణ‌ప‌య్య పండుగ కోసమే (festivals). ఆ పండుగ‌కు స‌రిగ్గా 17 రోజులే ఉంది. ఈ సెప్టెంబ‌ర్ నెల‌లో వినాయ‌క చ‌వితితో క‌లిపి మొత్తం 5 పండుగ‌లు రాబోతున్నాయి. అస‌లైన పండుగ‌లు మొద‌ల‌య్యేది కూడా సెప్టెంబ‌ర్ నుంచే.

శ్రీకృష్ణ జన్మాష్ట‌మి

ఈ నెల‌లో జ‌న్మాష్ట‌మి సెప్టెంబ‌ర్ 6, 7 తేదీల్లో వచ్చింది. అష్ట‌మి తిథి రోహిణి న‌క్ష‌త్రం క‌లిపి వ‌స్తే ఆ రోజును శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మిగా సెల‌బ్రేట్ చేసుకుంటారు. నార్త్ ఇండియాలో ఈ పండుగ‌ను చాలా గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుంటారు.

క‌జారీ తీజ్

ఇది మ‌న తెలుగు వాళ్లు చేసుకోరు. భాద్ర‌ప‌ద మాసం కృష్ణ‌ప‌క్షంలో ఈ క‌జారీ తీజ్‌ను జ‌రుపుకుంటారు. సెప్టెంబ‌ర్ 2న క‌జారీ తీజ్ వ‌చ్చింది. (festivals)

హ‌ర్తాళీక తీజ్

భాద్ర‌ప‌ద మాసం శుక్ల‌ప‌క్షం రోజున హ‌ర్తాళీక తీజ్ జ‌రుపుకుంటారు. సెప్టెంబ‌ర్ 18న హ‌ర్తాళీక తీజ్‌ను జ‌రుపుకుంటారు. ఎక్కువ‌గా నార్త్ ఇండియ‌న్స్ సెల‌బ్రేట్ చేసుకునే ఈ తీజ్ రోజున బంక మ‌ట్టితో శివుడు పార్వ‌తిల విగ్ర‌హాల‌ను త‌యారుచేసి ఊరేగిస్తార‌ట‌. ఇలా చేస్తే పెళ్లిళ్లు కాని వారికి త్వ‌రగా క‌ళ్యాణం అవుతుంద‌ని న‌మ్ముతారు.

వినాయ‌క చ‌వితి

మ‌నంద‌రికీ ఎంతో ఇష్ట‌మైన బొజ్జ‌గ‌ణ‌ప‌య్య పండుగ సెప్టెంబ‌ర్ 19న వ‌చ్చింది. భాద్ర‌ప‌ద మాసం శుక్ల ప‌క్షం నాడున చ‌వితి రోజు గ‌ణ‌నాథుడు జ‌న్మించాడు. ఆ తేదీని మ‌నం వినాయ‌క చ‌వితిగా సెల‌బ్రేట్ చేసుకుంటాం. (festivals)

రాధాష్ట‌మి

కృష్ణుడి ప్రియ‌స‌ఖి రాధ పుట్టింది కూడా భాద్ర‌ప‌ద మాసం శుక్ల ప‌క్షంలోనే. ఈసారి రాధాష్ట‌మి సెప్టెంబ‌ర్ 23న వ‌చ్చింది.