Horoscope Today: ఈ రాశి వారికి అనుకోని ధనలాభం
Horoscope Today: రోజూ రాశిఫలాలు చూసుకుని తమ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకోవాలని ఉంటుంది. రాశి ఫలాల్లో ఇచ్చే పరిహారాలు, చిట్కాలు కూడా చాలా మంది కఠినంగా పాటిస్తుంటారు. ఈరోజు (ఫిబ్రవరి 9) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (Aries)
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. దానిని ఎలా కాపాడుకుంటారో మీ ఇష్టం. పొగొట్టుకున్న డబ్బును రాబట్టుకునేందుకు యత్నిస్తారు. పని విషయంలో నిబద్ధతతో ఉంటారు. ప్రయాణాల వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. ప్రాపర్టీ విషయంలో మిమ్మల్ని మోసం చేసేవారు ఉన్నారు జాగ్రత్త.
వృషభం (Taurus)
వాకింగ్, జాగింగ్ తప్పనిసరిగా చేయాలి. అనుకోకుండా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. వేరే విషయంలో పడి పనిని పక్కన పెట్టేస్తారు. దూర ప్రయాణాలు చేసేవారికి వీసా సమస్యలు ఉంటాయి. ఇంటి ఓనర్లకు తమ ప్రాపర్టీల నుంచి మంచి రాబడి ఉంటుంది.
మిథునం (Gemini)
ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఉండటంతో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధపెడతాయి. ఇచ్చిన అప్పుని రాబట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తిపరంగా బాగానే ఉంది. ఆర్ధిక లాభం గోచరిస్తోంది.
కర్కాటకం (Cancer)
వృత్తి పరంగా మీకు ఏర్పడే కొన్ని పరిచయాలు మీకు మంచి రిలేషన్స్‌ని తెచ్చిపెడతాయి. ఇంటి పెద్దలు మీకు అన్ని వేళలా సాయంగా ఉంటారు. ఓ పని మీద బయటకు వెళ్తారు కానీ లాభదాయకంగా ఉండదు. విద్యార్ధులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. మీకు ఏ సమస్య వచ్చినా సాయం చేసేందుకు ఇంటి పెద్ద ఎప్పుడూ ముందుంటారు.
సింహం (Leo)
మీరు ఆర్థికంగా, మానసికంగా సంతృప్తిగా ఉంటారు. అనారోగ్యం మీకు చికాకు కలిగిస్తుంది. కొత్తగా వచ్చే తోటి ఉద్యోగి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాల్సి ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల మీరు వెళ్లలేకపోతారు. రోడ్డు మార్గంలో ప్రయాణించాలనుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గతంలో చేసిన సాయం గుర్తుంచుకుని వారు కూడా మీకు సాయం చేయాలని అనుకుంటారు.
కన్య (Virgo)
అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఒక పథకంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఒక సవాల్‌తో కూడుకున్న సందర్భాన్ని చాకచక్యంగా డీల్ చేస్తారు. బిజినెస్ టూర్‌పై వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్ధులకు తాము సబ్మిట్ చేసిన అసైన్‌మెంట్ మంచి ఫలితాలను ఇస్తుంది.
తుల (Libra)
మీరు మీ బరువును నియంత్రించుకోవాలని అనుకుంటారు కానీ అది అంత సులువుగా అనిపించకపోవచ్చు. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తిపరంగా మీకు ఇచ్చిన టాస్క్‌ను సమర్ధవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఓ ప్రాపర్టీని అమ్మేందుకు క్లైంట్ కోసం ఎదురుచూస్తుంటారు కానీ అది అంత సులువు కాదు.
వృశ్చికం (Scorpio)
బయటి ఆహారాలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధికంగా బాగుంది. వృత్తిపరంగా మీరు ఎంత కష్టపడతారో అంతే ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో గడిపేందుకు కాస్త సమయం కేటాయించుకోవాల్సిందే.
ధనుస్సు (Sagittarius)
జీవనశైలి సమస్యలతో బాధపడుతున్నవారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. మీరు ఇచ్చిన అప్పు తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. ప్రపార్టీని కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
మకరం (Capricorn)
రోజూ వర్కవుట్స్ చేసేవారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు తెలిసో తెలీకో నష్టాన్ని కలిగించే పథకంలో పెట్టుబడులు పెడుతున్నారు. ముందు దానిని వెంటనే నిలిపివేయండి. వృత్తిపరంగా మీరు చేసే ఓ పనికి ప్రశంసలు లభిస్తాయి.
కుంభం (Aquarius)
ఓ విషయంలో మీరు పాటించే ఇంటి చిట్కా బాగా ఉపయోగపడుతుంది. మీరు తెలివిగా చేసే ఆర్ధిక పెట్టుబడులు ఆర్ధికంగా మంచి ఫలితాలను ఇస్తుంది. మీ కుటుంబ సభ్యులు సాయం చేస్తారు. ఓ ప్రాపర్టీని కాపాడుకోవడానికి ఫండ్స్ పొదుపు చేసుకుంటారు.
మీనం (Pisces)
మీరు తినే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. ఇష్టారాజ్యంగా తినేయకూడదు. మీ ఫిట్నెస్‌పై ప్రశంసలు కురిపించేవారు ఉన్నారు. వ్యాపారవేత్తలకు నష్టాలు గోచరిస్తున్నాయి. ప్రాపర్టీ విషయంలో మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది. చదువు విషయంలో మీరు ఎదుర్కొంటున్న ఓ క్లిష్ట సమస్యను ఇతరుల సాయంతో సులువుగా సాల్వ్ చేసుకుంటారు.