Ganesh: కోర్కెలు తీర్చే సింధూర ఏకదంతుడు..!
Hyderabad: ఎన్నో ఏళ్ల నాటి విగ్రహం.. కోరిన కోర్కెలు వెంటనే తీర్చే సింధూర గణనాథుడు (ganesh) గురించి తెలుసుకుందామా? ఈ ఆలయం పేరు గణేష్ గడ్డ (ganesh gadda). తెలంగాణ రాష్ట్రంలోని పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఉంది ఈ గణనాథుని ఆలయం. ఇక్కడ దక్షిణ ముఖ గణపతిగా (ganesh) భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడి గణనాథుడు సంకటహర చతుర్థి రోజున విశేషంగా పూజలు అందుకుంటారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముడుపు కట్టి 108 ప్రదక్షిణలు చేస్తే కోరికలు వెంటనే తీరుతాయని భక్తుల నమ్మకం.
ప్రతి ఆదివారం లేదా మంగళవారం నాడు 11 వారముల పాటు 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. దాదాపు 200 ఏళ్ల క్రితం కర్ణాటకకు చెందిన శివరామ భట్టు అనే భక్తుడు కాలినడకన తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇతను గణేశుడికి పరమ భక్తులు. సంకటహర చతుర్థి నాడు శివరామ భట్టు ఎక్కడుంటే అక్కడికి గణనాథుడు స్వయంగా వచ్చి పూజలు అందుకుంటాడట. ఓసారి భట్టు తిరుమల వెళ్తూ రుద్రారం అడవుల్లో ఆగాడు. అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారుచేసి పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ విగ్రహాన్ని అడవిలోనే వదిలేసి భట్టు తిరుమల పాదయాత్రకు వెళ్లాడు. (ganesh)
కొన్నాళ్లకు ఈ విగ్రహం కనుమరుగైపోయింది. ఓసారి మఖందాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా.. గణనాథుడి విగ్రహాన్ని చూసి ఆ గుర్రం కదల్లేకపోయింది. దాంతో ఆ విగ్రహం పక్కనే మఖందాస్ నిద్రపోయాడు. అప్పుడు అతనికి కలలో వినాయకుడు కనిపించి తనకు అక్కడే చిన్న గుడి కట్టాలని కోరాడు. దాంతో మఖందాస్ వెంటనే గుడి కట్టించే పని మొదలుపెట్టాడు. అలా ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. (ganesh)
తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. గర్భాలయంలో స్వామి విగ్రహం సింధూరంతో ఉంటుంది. స్వామివారి విగ్రహం కింద మకర తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. స్వామివారు దక్షిణ ముఖంగా ఉన్నందున కోరిన కోర్కెలు 41 రోజుల్లోనే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పుష్యశుద్ధ పాడ్యమి నుంచి పుష్యశుద్ధ చతుర్ధశి వరకు స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంబరాన్నంటుతాయి.