Spiritual: చనిపోయిన వారి ఆత్మ ఇంటికి వస్తుందా?
Spiritual: భూమ్మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించకుండా ఉండదు. అంటే శాశ్వతంగా ఈ భూమిపై ఎవరూ ఉండరు. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే. అయితే.. ఒక జీవి మరణించిన తర్వాత ఆ ఆత్మకు ఏమవుతుందో తెలుసా? మరణించిన తర్వాత ఆత్మకు ఏం జరుగుతుంది? మరణించిన 24 గంటల తర్వాత మళ్లీ ఆ ఆత్మ తన ఇంటికి వెళ్తుందా? ఎన్ని రోజులు ఆత్మ ఇంట్లో ఉంటుంది? ఇవన్నీ తెలుసా? ఈ విషయాలన్నింటి గురించి గరుడ పురాణంలో వివరంగా చెప్పారు.
గరుడ పురాణంలో చెప్పిన విధంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకోవడానికి యమ ధూతలు వస్తారు. అక్కడ ఆ వ్యక్తి పాప పుణ్యాల గురించి పరిశీలిస్తారు. 24 గంటల్లో యమ ధూతలు ఆ ఆత్మను మళ్లీ ఇంటి దగ్గరే వదిలిపెడతారు. చనిపోయిన వారి ఆత్మను యమధూతలు కుటుంబీకుల మధ్యలో వదులుతారట. ఆ ఆత్మ వారి మధ్యే తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది. కానీ అక్కడున్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆ ఆత్మ మాటలు ఎవ్వరికీ వినపడవు. ఆ ఆత్మ అది చూసి బాధపడుతుంది. ఆత్మ పెద్ద పెద్ద శబ్దాలతో వారిని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా తన మాటలు ఎవ్వరికీ వినిపించవు. చనిపోయిన వారి ఆత్మ తమ శరీరంలోకి వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందట. ఆత్మ యమధూతల బంధనంలో ఉంటుంది కాబట్టి ఎంత ప్రయత్నించినా తిరిగి తన శరీరంలోకి వెళ్లలేదు. (Spiritual)
ALSO READ: ఎలుక కనిపిస్తే ఏమవుతుంది.. శుభమా అశుభమా?
ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో ఇంకా చాలా చెప్పారు. ఎవరైనా మరణిస్తే తమ కుటుంబ సభ్యులు ఏడవటం చూసి ఆ ఆత్మ బాధపడుతూ ఉంటుంది. అది కూడా ఏడుస్తుందట. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. తన జీవితంలో తాను చేసిన పనులను గుర్తుచేసుకుంటూ ఏడుస్తుంటుంది. ఆత్మను వదిలి వెళ్లినప్పుడు ఆత్మ తిరిగి వెళ్లడానికి యమలోక మార్గం గుర్తుండదు. అంత బలం కూడా ఉండదట. గరుడ పురాణాన్ని బట్టి ఆ ఆత్మకు 13 రోజుల వరకు పిండ దానం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆత్మ పునర్నిర్మాణం జరుగుతుంది. 11వ, 12వ రోజు పిండ దానం చేసినప్పుడు దాంతో శరీరం, మాంసం పునర్నిర్మాణం జరుగుతుంది.
13వ రోజు పురోహితుడికి దానం చేసినప్పుడు ఆత్మ యమలోకానికి మార్గం గుర్తించగలుగుతుంది. ఆత్మకు 13 రోజులు పిండ దానం చేయడం ద్వారా దానికి యమలోకానికి వెళ్లడానికి మార్గం, బలం వస్తుంది. అందుకే గరుణ పురాణంలో ఏం చెప్పారంటే.. ఎప్పుడైతే ఒక వ్యక్తి మరణిస్తాడో వారి ఆత్మ కుటుంబీకుల మధ్యలోనే 13 రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది. మరణించినవారి ఆత్మ యమలోకానికి వెళ్లడానికి ఏడాది పడుతుంది. ఇక్కడ మనం గ్రహించవలసిన అంశం ఏంటంటే.. 13 రోజులు మనం అర్పించిన ఆ పిండదానం చనిపోయిన ఆత్మ ఆహారంగా తీసుకుంటుంది. కానీ ఎవరికైనా పిండదానం చేయకపోతే వారి పరిస్థితి ఏంటి?
ఈ విషయాన్ని కూడా గరుడ పురాణంలో వివరించారు. ఎవరికైతే పిండదానం చేయరో వారిని బలవంతంగా యమధూతలు గుంజుకుంటూ యమలోకానికి తీసుకెళ్తారు. అందుకే చనిపోయినవారి ఆత్మకు చాలా కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే 13 రోజుల వరకు పిండ దానం చేస్తారు. ఇది తప్పనిసరిగా చేయాల్సిందే. ఇవన్నీ కాకుండా గరుడ పురాణంలో 13వ రోజు ఆత్మ కుటుంబ సభ్యులు, పురోహితులకు ఇచ్చే అన్నదానం కష్టం అనుకుని బాధతో ఇస్తే ఆ ఆత్మకు శాంతి లభించదు. ఆత్మ క్షోభిస్తుంది.
ALSO READ: Spiritual: కలలో పాములు కనిపిస్తున్నాయా?
ఎవరైతే చనిపోయినవారి కుటుంబ సభ్యులను బాధపెట్టి భోజనాలు పెట్టించడానికి బలవంతం చేస్తారో అలాంటివారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించడట. ఇలాంటివారు మరణించిన తర్వాత వారికి చాలా కష్టాలు పెడతాడు. అటువంటి వారిని మృత్యులోకానికి పంపుతాడు. ఏ మనిషైతే తన జీవిత కాలంలో పుణ్య కార్యాలు, దాన ధర్మాలు చేస్తాడో అతని ఆత్మను చనిపోయిన 13 రోజుల తర్వాత యమధూతలు యమలోకానికి తీసుకెళ్తారు. అలాంటివారికి మృత్యులోకం నుంచి యమలోకానికి వెళ్లే మార్గంలో ఎలాంటి కష్టం అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఏ మనిషైతే తన జీవిత కాలంలో పాపాలు చేస్తూ మరణిస్తే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ యమధూతలు యమలోకానికి తీసుకెళ్తారు. దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతూ క్షమించమని ప్రాథేయపడుతూ ఉంటుంది.