Obesity: బారియాట్రిక్ సర్జరీ..లాభమా శాపమా?
సాధారణంగా సర్జరీ చేయించుకోవడం అంటే చాలామంది భయపడతారు. అనారోగ్యం తీవ్రంగా ఉన్నప్పుడు సర్జరీ చేయడం తప్పనిసరి అవుతుంది. మామూలుగా సర్జరీలు అనారోగ్యాన్ని నివారించడానికి చేస్తారు వైద్యులు. కానీ ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు సాధారణంగా సర్జరీలు పనిచేయవు. కానీ బారియాట్రిక్ సర్జరీతో దీర్ఘకాలిక వ్యాధులను కూడా నియంత్రించవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ శస్త్ర చికిత్సతో ఊబకాయాన్ని తగ్గించే అవకాశం ఎక్కువ. భారతదేశంలో దాదాపు 13 కోట్లకుపైగా జనాభా ఊబకాయంతో బాధపడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా దీన్ని అంచనా వేస్తారు. ఎత్తుకు తగిన బరువు ఉంటే దానిని ఆరోగ్యకరమైన బరువు అంటారు. ఇది 18 నుంచి 22 మధ్య ఉంటుంది. అయితే ఊబకాయం సమస్య నుంచి బయటపడేందుకు బారియాట్రిక్ సర్జరీ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఈ శ్రస్తచికిత్స వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలుసుకుందాం..
జీర్ణక్రియ సమయంలో ఆహార విచ్ఛిన్న ప్రక్రియను మార్చేందుకు బారియాట్రిక్ శస్త్రచికిత్స సహాయపడుతుంది. దీని ఫలితంగా కేలరీలు, పోషకాలు గ్రహించబడతాయి. శస్త్రచికిత్స ఆకలి, ఆకలి కోరికలను నియంత్రిస్తుంది. కాలక్రమేణా, ఇది గణనీయమైన బరువు తగ్గడానికి, క్లిష్టమైన వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బారియాట్రిక్ శస్త్రచికిత్స అధిక శరీర బరువులో దాదాపు 70-90% తగ్గించడానికి సహాయపడుతుంది.
రక్తపోటు
ఊబకాయం ,సమస్య గలవారిలో పెరిగిన శరీర బరువు గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. తద్వారా రక్తం శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. శరీర పనితీరును అదే స్థాయిలో నిర్వహించడానికి శరీరానికి ఆక్సిజన్, పోషకాలతో సమృద్ధిగా ఉన్న రక్తం ఉత్పత్తి అవసరం. ఇది శరీరంలో రక్తపోటును పెంచుతుంది. ఈ మార్పులన్నీ గుండె నిర్వహించడం కష్టం మరియు దాని పనితీరుపై శాశ్వత ప్రభావాన్ని చూపవచ్చు. బారియాట్రిక్ సర్జరీ బరువును తగ్గించడం, గుండెపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఊబకాయ సమస్య వారిలో శరీర బరువు తగ్గడంతో శారీరకంగానే కాకుండా మానసింకంగానూ దృఢత్వం పెరుగుతుంది. తద్వారా గుండెపై ఒత్తిడి తగ్గి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
టైప్ 2 మధుమేహం
బారియాట్రిక్ సర్జరీ టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించేందుకు సహాయపడుతుంది. ఇది శరీరంలోని అధిక బరువు కణాలలో ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపిస్తుంది. ఫలితంగా మధుమేహం ప్రారంభ దశలో పేలవమైన గ్లైసెమిక్ నియంత్రణ ఏర్పడుతుంది. బారియాట్రిక్ శస్త్రచికిత్సతో, చాలా మంది రోగులలో మధుమేహాన్ని నియంత్రించడం, నివారించడానికి వీలుపడుతుంది. ఇది అధిక ఇన్సులిన్ మోతాదులో సరిగా నియంత్రించబడని మధుమేహ వ్యాధిగ్రస్తులలో గణనీయమైన మెరుగుదలను చూపుతుంది.
పక్షవాతం, గుండెపోటు
అధిక బరువు సమస్య గలవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. బారియాట్రిక్ సర్జరీతో, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు, స్లీప్ అప్నియాతో సహా ఊబకాయం యొక్క సమస్యలను నియంత్రించవచ్చు. హర్ట్‌ఎటాక్, గుండె సంబంధ సమస్యలను నివారించవచ్చు.
డిప్రెషన్
బారియాట్రిక్ సర్జరీ కారణంగా బరువు తగ్గడం వ్యక్తి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తద్వారా ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో జీవించడానికి ఈ సర్జరీ బాగా దోహదపడుతుంది.
కిడ్నీ సమస్యలు
మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలు మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఈ ప్రభావాన్ని తగ్గించనప్పుడు, చికిత్స చేయనప్పుడు ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యంగా మారి పూర్తిగా మూత్రపిండాలు చెడిపోయే అవకాశం ఉంది. బేరియాట్రిక్ సర్జరీ ఆ స్థితిని చేరకుండా నిరోధించడమే కాకుండా మూత్రపిండాల పనితీరును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
కాలేయం
ఊబకాయం వల్ల కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోయి కొవ్వు కాలేయం ఏర్పడుతుంది. దీనిని ఫ్యాటి లివర్ అంటారు. బారియాట్రిక్ ప్రక్రియ కారణంగా బరువు తగ్గిన తర్వాత ఈ పరిస్థితి సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్‌గా మారకుండా సాధారణ స్థితికి చేరుతుంది.
బారియాట్రిక్ సర్జరీ మహిళల్లో PCOD సమస్యను తగ్గించి సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు మరియు వెన్నునొప్పిని తగ్గిస్తుంది. ఇది అదిక ఊబకాయం ఉన్న రోగులలో స్లీప్ అప్నియా పరిస్థితిని నియంత్రిస్తుంది.
అపోహలు
బారియాట్రిక్ సర్జరీ గురించి ప్రజల్లో రకరకాల అపోహలు ఉన్నాయి. ఈ శస్త్రచికిత్స ద్వారా అదనపు మాంసాన్ని తొలగిస్తారనీ, తక్షణమే బరువు తగ్గడానికి దారితీస్తుందని, ఇది చివరి చికిత్స ఎంపికగా ఉపయోగించబడుతుందని నమ్ముతారు. బరువు తగ్గించే తేలికైన మార్గం అని కూడా భావిస్తారు. ఊబకాయంతో బాధపడేవారికి ఇది మంచి పరిష్కారంగా పరిణమిస్తుందంటున్నారు నిపుణులు. ఈ చికిత్స అనంతరం వైద్యులు చెప్పిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. లేదంటే కోల్పోయిన బరువును మించి శరీర బరువు పెరిగి సమస్య అధికమవుతుంది.