ఉసిరితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
‘శ్రీ ఫలం’గా పేరుగాంచిన ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజువారి ఆహారంలో ఉసిరిని చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఎల్లప్పుడూ తాజాగా ఉండే ఉసిరితో చాలా ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఉసిరి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి తో పాటు ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఉసిరిని వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆయుర్వేదంలోనూ ఉసిరి స్థానం చాలా విశిష్టమైనది. ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
*ఉసిరిలోని యాంటీ ఇంఫ్లమెంటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. ఉసిరి రసాన్ని పరగడుపున తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఉసిరి రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. ఉసిరిలో ఉండే విటమిన్ సి తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచడంలో సహాయపడుతుంది. ఇది కొవ్వును కరిగించడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
*ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఆహారం జీర్ణమయ్యేందుకు సాయపడి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది శరీరం నుంచి హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను కూడా తొలగిస్తుంది. ఉసిరి రసం మూత్రంలో మంట, చీము వంటి యూరినరీ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది.
*అధిక బరువుతో బాధపడేవారికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది. ఉసరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కారణంగా.. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. అందువల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఉసిరి తరచుగా తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది.
*డయాబెటిస్‌తో బాధపడేవారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఒక ఉసిరి కాయ తినడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుంది.
*ఉసిరిలోని పోషకాలు హెయిర్ ఫోలికల్స్‌ను బలోపేతం చేస్తాయి. ఇది జుట్టు ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. కుదుళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఉసిరిలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివారిస్తాయి. సహజసిద్దంగా తయారుచేసే షాంపుల్లో ఉసిరి పొడి చేసి వాడతారు. ఇళ్లలోనూ జుట్టుకు ఉసిరి ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
*ఉసిరిలో ఉండే విటమిన్ సి చర్మానికి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఒంట్లో ఉంటే టాక్సిన్స్ ను బయటికి పంపడం వల్ల చర్మం వృద్దాప్యం, ముడతలు రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కంటి చూపును పెంచడంలో ఉసిరి బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది.