Ugadi రోజున ఇలా చేస్తే కాలం కలిసొస్తుంది
Ugadi: ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ తేదీన మంగళవారం వచ్చింది. ఈ సంవత్సరాన్ని క్రోధి నామ సంవత్సరం అంటారు. మరి ఈ ఉగాది నాటి నుంచి అంతా మంచే జరగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఉగాది రోజున కచ్చితంగా ఈ పనులు తప్పకుండా చేయాలి. అవేంటంటే..
*ఒంటికి, తలకు నువ్వుల నూనె పట్టించుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి. అది కూడా 10 లేదా 11 గంటలకు నిద్ర లేచి చేయడం కాదు.. సూర్యోదయం సమయంలో ఇలా చేస్తే ఎంతో మంచిది.
*స్నానం చేసాక కీర్తనలు, స్తోత్రాలు చదువుకోండి. మీకు వచ్చినవే చదవండి. కొత్తగా నేర్చుకుని మరీ చదవాల్సిన పని లేదు.
*వేపాకు తప్పనిసరిగా తినాలి. కేవలం వేపాకు తిన్నా ఫర్వాలేదు లేదా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తిన్నా ఫర్వాలేదు.
*పంచాంగ శ్రవణం కచ్చితంగా వినాలి. చదవడం కంటే వినడం ఎంతో మంచిది. ఎందుకంటే పంచాంగం అనేది ఎవరు పడితే వారు చదివేది కాదు. వేదాలను ఆకళింపు చేసుకున్న వేద పండితులు మాత్రమే చదివేది. అందుకే ఓ పండితుడు కానీ గురూజీ కానీ పంచాంగ శ్రవణం చదువుతున్నప్పుడు చక్కగా వింటే మంచిది. ఆ తర్వాత మీకు ఏమన్నా సందేహాలు ఉంటే పుస్తకంలో చూసుకోవచ్చు.
*ఇది వేసవి కాలం కావడంతో ఉగాది రోజున మీ ఇంటి దగ్గర్లో ఓ చలివేంద్రాన్ని ఏర్పాటుచేయండి. ఇలా చేయలేకపోతే కనీసం మీ బాల్కనీలో ఓ చిన్న గిన్నలో నీళ్లు నింపి పెట్టండి. పక్షులు దాహాన్ని తీర్చుకుంటాయి. వ్యక్తి కానీ జంతువు కానీ పక్షి కానీ దాహంతో అల్లాడిపోతుంటే వారికి గుక్కెడు నీరు ఇవ్వడం వల్ల కలిగే పుణ్యం అంతా ఇంతా కాదు