Spiritual: తథాస్తు దేవతలు నిజంగా ఉన్నారా? వారు దీవిస్తే కోరికలు నెరవేరతాయా?
Spiritual: సాయంత్రం వేళల్లో ఏదన్నా అశుభం మాట్లాడితే అలా అనకూడదు తథాస్తు దేవతలు ఉంటారు అని పెద్దలు చెప్తుంటారు. అసలు ఈ తథాస్తు దేవతలు ఎవరు? మనం అనుకున్నవి తీరాలని వారు ఆశీర్వదిస్తే అవి నిజం అయిపోతాయా?
తథ అంటే ఆ ప్రకారం, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారట. ఇలా వారు అనగానే అది జరుగుతుందట. పురాణాల ప్రకారం సూర్యుని భార్య అయిన సంధ్యా దేవి వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యా దేవిని చూసి సూర్యుడు కూడా గురువు రూపాన్ని దాల్చి సంధ్యా దేవి వద్దకు వెళ్తాడు. వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు. వీరినే తథాస్తు దేవతలు అంటారు. అశ్విని దేవతులు ఎప్పుడూ ఒక బంగారు రథంపై ప్రయాణిస్తుంటారు. వీరు ఎంతో వేగంగా వెళ్తుంటారు. వీరు ప్రయాణిస్తున్న మార్గంలో తథాస్తు అనుకుంటూ ..వేద మంత్రాలు జపిస్తూ వెళ్తారట.
యజ్ఞాలు వేదాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అశ్విని దేవతల చేతిలో ఒక బెత్తం పట్టుకుని ఎక్కడ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్లి యజ్ఞాల సమీపంలో ఉన్న పూజా ద్రవ్యాల వాటికి సంబంధించిన వస్తువులపై బెత్తంతో తాకి వెళ్తూ ఉంటారు. దాని వల్ల యజ్ఞం చేసినప్పుడు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇతరుల మంచి కోరుకునే వారు ఎవరైనా తథాస్తు అంటే అది కచ్చితంగా జరుగుతుందట. అశ్వినీ కుమారులు ఒక చేత ఆయుర్వేద గంధాన్ని, మరోచేత అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు. మన గురించి మనం ఏదైనా అనుకుంటే వారు తథాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో దీవిస్తుంటారని పురాణాలు చెప్తున్నాయి. (Spiritual)
అందుకే ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు వచ్చినా అశ్విని దేవతలకు సంబంధించిన మంత్రం జపిస్తే అవి దూరం అవుతాయట. అనారోగ్య సమస్యలు ఉన్నవారు అనేక సమయాల్లో వాహనాలపై వచ్చి సమస్యలు తీర్చారని పురాణంలో ఉంది. అయితే అశ్వినీ దేవతలు ప్రతిరోజూ ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకానికి వచ్చి అన్ని చోట్లా తిరుగుతూ ఉంటారు. ఆ ప్రత్యేకమైన సమయంలో ఎవరు ఏ మాట అంటే అది జరుగుతుంది.