Vastu Tips: ఈ విగ్ర‌హాలు ఉంటే దుబారా ఖ‌ర్చులే

do not keep these idols at home to avoid financial loss

Vastu Tips:  వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో కొన్ని దేవుడి విగ్ర‌హాలు ఉంటే దుబారా ఖ‌ర్చులు.. డ‌బ్బు నిల్వ ఉండ‌క‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. ఇంత‌కీ ఎలాంటి విగ్ర‌హాలు ఇంట్లో పెట్టుకోకూడ‌దో తెలుసుకుందాం.

కాళీ మాత‌

ఇంట్లో కాళీ మాత విగ్ర‌హం ఉండ‌కూడ‌ద‌ట‌. ఆమె శ‌క్తికి ప్ర‌తిరూపం. కాళీ మాత విగ్ర‌హం కానీ ఫోటో కానీ ఇంట్లో ఉంటే ఆల‌యంలో పాటించే పూజా విధానాలు పాటించాల్సి ఉంటుంది. లేక‌పోతే అమ్మ‌వారు ఆగ్ర‌హిస్తుంద‌ని అంటారు.

శ‌ని దేవుడు

శ‌ని దోషం న‌డుస్తోంది… ఏళ్ల నాటి శ‌ని దాప‌రించింది అంటూ ఉంటాం. అలాంట‌ప్పుడు ఆయ‌న ఫోటో కానీ విగ్ర‌హం కానీ ఇంట్లో ఉంటే బెడిసి కొడుతుంది. శ‌ని దేవుడిని ఆరాధించాలంటే ఒక ప‌ద్ధ‌తి ఉంటుంది. ఆయ‌న్ని ఆల‌యంలో ఉండే న‌వ‌గ్ర‌హాల రూపంలోనే ఆరాధించాలి.

న‌ట‌రాజ (శివుడు)

శివుడి లింగం ఉంటేనే ఎంతో నిష్ఠ‌గా పూజలు చేయాలి అని చెప్తుంటారు. అలాంటిది ఇక న‌ట‌రాజ రూపంలో ఉండే శివుడి విగ్ర‌హాన్ని ఇంట్లో పెట్టుకుంటే అంతే సంగ‌తులు.