Lifestyle: జీవితంలో ఇవి అస్స‌లు మ‌ర్చిపోకండి

Hyderabad: మ‌నం జీవితంలో ఏ స్థాయిలో ఉన్నా కొన్ని విష‌యాల‌ను మాత్రం అస్సలు మ‌ర్చిపోకూడ‌దు. అవేంటంటే.. (lifestyle)

పెంచిన చేతులు
ధ‌నికుడైనా, పేద‌వాడైనా.. ఏ స్థాయిలో ఉన్నా మ‌న‌ల్ని క‌ని పెంచిన‌వారిని వ‌దిలేయ‌కండి. వారిని మ‌ర్చిపోకండి. రోజులు గ‌డిచే కొద్దీ మ‌న క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం వ‌స్తుంద‌నే ఆశ‌తో ఉంటాం. కానీ అదే స‌మ‌యంలో మ‌న త‌ల్లిదండ్రులు కూడా ముస‌లివారు అయిపోతున్నారు. రోజూ వారినే అంటిపెట్టుకుని ఉండండి అని చెప్ప‌డంలేదు. వారికి మీరు లేరు అనే లోటును మాత్రం క‌లిగించకండి.

మైండ్
మ‌న‌కంటూ ఉన్న ఏకైక ఆస్తి ఏద‌న్నా ఉందంటే.. అది మైండ్ సెట్. అది ఎంత క్రియేటివ్‌గా ఆలోచిస్తే అంత రిచెస్ట్ ప‌ర్స‌న్ అవుతాం. అలాంటి బుర్ర‌లోకి మీరు ఎలాంటి ఆలోచ‌న‌లు పంపుతున్నారు అనేది చాలా ముఖ్యం.

సాయం చేసిన‌వారు
మీరు క‌ష్టాల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా నిలిచిన వారిని అస్స‌లు మ‌ర్చిపోకండి. సాయం చేసిన‌వారు మ‌ర్చిపోయినా ఫ‌ర్వాలేదు. వారి మాత్రం మ‌నం అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు.

నో చెప్పడం
ఎవ‌రైనా ఏదైనా చెప్తే అది మీకు న‌చ్చ‌క‌పోయినా ఎస్ అని చెప్తున్నారా? ఈ ప‌ద్ధ‌తి అస్స‌లు మంచిది కాదు. మీకు న‌చ్చ‌క‌పోయినా, మీరు చేయ‌లేక‌పోయినా వెంట‌నే నో చెప్ప‌డం నేర్చుకోండి. వాళ్లు ఫీల‌వుతారేమో, త‌ప్పుగా అనుకుంటారేమో అని మాత్రం ఆలోచించ‌కండి. వాళ్లు బాగానే ఉంటారు. మ‌ధ్య‌లో నాశ‌న‌మ‌య్యేది మన‌మే.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విష‌యాలు ఉన్నాయి. కానీ రీసెర్చ్ చేస్తే అన్నిటికంటే ఈ పై నాలుగు ఎంతో విలువైన‌వి అని తెలిసి వాటినే మీతో పంచుకుంటున్నాం.