Vastu: వంటింటికి ఈ రంగులు అస్సలు వాడకండి..!
Vastu: సొంతిల్లు కట్టుకోవాలనుకునేవారు ముందుగా వాస్తు పరంగా అన్నీ సక్రమంగా ఉన్నాయో లేవో చూసుకుంటారు. కాస్త అటూ ఇటూ అయినా తేడాలు వచ్చేస్తాయని భయం. అయితే వంట గదికి ఎలాంటి రంగులు పడితే అలాంటివి వేయించకూడదని వాస్తు శాస్త్రం చెప్తోంది. వాస్తు ప్రకారం వంటింటికి ఎలాంటి రంగులు వేస్తే మంచిదో తెలుసుకుందాం.
పింక్ – గులాబీ రంగు అనేది ప్రేమకు గుర్తు. కానీ ఈ రంగు కిచెన్‌కు అస్సలు వేయకూడదు. కిచెన్‌కు ఈ రంగు వేస్తే ఎక్కడలేని బద్ధకం దరిచేరుతుంది. అసలు వంట చేయాలని కూడా అనిపించదు. అయినా కూడా పింక్ కావాలనుకుంటే ఇతర రంగులతో కలిపి వేయించుకుంటే మంచిది.
గ్రే – గ్రే రంగును కిచెన్‌కు వేస్తే నెగిటివిటీ పెరుగుతుంది. విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రే రంగుకు ఆకుపచ్చ లేదా పసుపు రంగులు కలిపి వేసుకుంటే బెటర్.
తెలుపు – తెలుపు రంగు శాంతికి గుర్తు. అలాగని దానిని కిచెన్‌కు వేస్తే వాస్తు ప్రకారం నప్పదు. తెలుపు రంగులో ఇతర రంగులు కలిపి వేయించుకుంటే మంచిది. లేదంటే ఏదో తెలీని వెలితిగా అనిపిస్తూ ఉంటుంది.
బ్రౌన్ – కిచెన్‌కు బ్రౌన్ రంగు వేస్తే అసలు అడుగు కూడా పెట్టబుద్ది కాదట. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. బ్రౌన్ రంగును పొరపాటున వేయించేసినా కాస్త లేత రంగులను కలిపి మరోసారి పెయింటింగ్ వేయిస్తే సెట్ అవుతుంది.
ఎరుపు – వాస్తు శాస్త్రంలో ఎరుపు ఎప్పుడూ అశుభాన్నే సూచిస్తుంది. వంటిల్లు మొత్తం ఎరుపు రంగుతో ఉంటే చూసిన ప్రతీసారి ఏదో తెలీని కోపం, చిరాకు కలుగుతూ ఉంటాయి. తెలీక ఎక్కువ తినేస్తూ కూడా ఉంటారట. అక్కడక్కడా ఎరుపు రంగును వేయడం కూడా మంచిది కాదు. అసలు కిచెన్‌లో రెడ్ అనేదే వద్దు.