Jobs: ఈ ఉద్యోగాలకు డిగ్రీలు అవసరం లేదు
Hyderabad: ఉద్యోగం (jobs) రావాలంటే చేతిలో కచ్చితంగా డిగ్రీ (degree) ఉండాలి. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు కాలం మారింది. ఉద్యోగులను ఎంచుకునే తీరు మారింది. ఇప్పుడు ఎంత చదివారు, ఏం చదివారు అన్న విషయాలు కంపెనీలు పట్టించుకోవడంలేదు. ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ లింక్డిన్ (linkedin) సర్వే ప్రకారం.. చాలా కంపెనీలు ఇక డిగ్రీ పట్టాలు చూడకుండా ఇంటర్వ్యూకి వచ్చిన వ్యక్తిలో ఏ నైపుణ్యాలు ఉన్నాయి అనేవి చూసే ఉద్యోగాలు ఇస్తాయని తేలింది. 2030 నాటికి ఉద్యోగులను ఎంచుకునే ముందు కంపెనీలు ఇక డిగ్రీ సర్టిఫికేట్లు అడగరని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ చెప్తోంది. డిగ్రీలు అవసరం లేని ఉద్యోగాలేంటో చూద్దాం.
2021నుంచి 2022 వరకు కన్‌సల్టింగ్ జాబ్స్ ఎక్కువయ్యాయ్. కంపెనీలకు, క్లైంట్లకు సలహాలు ఇవ్వడానికి క్లైంట్ అడ్వైజర్లు, బిజినెస్ కన్‌సల్టెంట్లను ఎంపికచేసుకుంటారు. వీరికి డిగ్రీలు అవసరం లేదు. మార్కెంటింగ్ ఇండస్ట్రీలో కూడా డిగ్రీలు అవసరం లేని ఎన్నో జాబ్స్ ఉన్నాయి. క్యాంపెయిన్లు, ఈమెయిల్ మార్కెటింగ్ బాగా తెలిసినవారు మార్కెంటింగ్ ఈజీగా దూరిపోవచ్చు. రీసెర్చ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేవారు కూడా డిగ్రీ లేకుండా ఎనలిస్ట్‌లుగా పనిచేయచ్చు. చక్కటి ఉద్యోగులను వెతికి పట్టుకుని వారిని కంపెనీలకు అందించగలిగే హెచ్ ఆర్‌లకు కూడా డిగ్రీ లేకుండా అవకాశాలు ఇస్తున్నారు. మీడియా అండ్ కమ్యూనికేషన్స్‌లో కూడా డిగ్రీలు లేకుండా ఎంతో మంది తమ క్రియేటివిటీతో ఉన్నత ఉద్యోగాలను సంపాదించుకున్నారు.
దీనిని బట్టి చూస్తే డిగ్రీ కన్నా స్కిల్ గొప్పది అని అర్థమైపోతోంది. ఇప్పుడున్న వివిధ కోర్సుల్లో చేరేవారిని కూడా కోర్సు సరే ఇందులో ఎంత నైపుణ్యం ఉంది అనే అడుగుతున్నారు. అలాగని చదువు మానేయమని కాదు.. ఎంత చదివినా ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్ సెట్ లేకపోతే ఆ డిగ్రీ ఎందుకూ పనికిరాదు.