రాస్బెర్రీలతో రక్తపోటుకు చెక్!
సంపూర్ణ ఆరోగ్యానికి మంచి జీవనశైలి అలవాట్లతో పాటు తినే ఆహారం కూడా ఆరోగ్యకరమైందిగా ఉండాలి. ముఖ్యంగా సమతుల్య ఆహారంతో పాటుగా పండ్లను కచ్చితంగా తినాలని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఎండాకాలంలో పోషకాలుగల తాజా పండ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. రాస్ బెర్రీల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఇక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి. రాస్బెర్రీలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం..
*రాస్ బెర్రీలు లేదా కోరిందకాయలు తీయగా ఉంటాయి. ఈ పండ్లులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల మన శరీరానికి అనేక ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పండ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.
* వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లను తింటే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది.ఇవి మెదడు కణాలను ఉత్తేజపరిచి మెదడు శక్తిని పెంచుతాయి.
* రాస్బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రెగ్యులర్ డైట్ లో వీటిని చేర్చుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ సమస్యలు రావు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
* రాస్బెర్రీ క్యాన్సర్ ను నివారించడానికి ఉత్తమమైన పండుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు క్యాన్సర్ ను కలిగించే కణాలను తొలగిస్తాయి. వీటిని తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందనేది నిపుణుల మాట.
* రాస్ బెర్రీస్‌లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వాటిలో విటమిన్ ఎ, బి 6 మరియు సి అధికంగా ఉంటాయి. వీటిలో పొటాషియం, మాంగనీస్, రాగి వంటి అరుదైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
* వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి క్యాన్సర్ కారకాలు అలాగే డీఎన్ఏను డేమేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతాయి. అలాగే, రాస్బెర్రీస్లో ఫోలేట్ కంటెంట్ ఎక్కువ. ఇది డీఎన్ఏ ను రిపేర్ చేస్తుంది.
* వీటిలో ఉండే యాంథోసియానిన్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీపై అలాగే గ్లూకోజ్ మెటబాలిజంపై ప్రభావం చూపుతాయి. ఇవి ముఖ్యంగా అధిక బరువున్న మహిళలు అలాగే పురుషుల్లో టైప్ 2 డయాబెటిస్ కి దారితీసే కారకాలను నిరోధిస్తాయి.
*వీటిలో షుగర్ కంటెంట్ తక్కువ. రాస్ బెర్రీస్ లో 15 గ్రాముల షుగర్ లభిస్తుంది. అంటే ఒక ఆపిల్‌లో ఉండేంత గ్లూకోజ్. అయినా, ఇందులోని బయో యాక్టివ్ కాంపౌండ్స్ షుగర్ వల్ల కలిగే చెడు ప్రభావాలను తగ్గిస్తాయి.