Spiritual: అగ్గిపుల్లతో దీపం పెట్టచ్చా?
Spiritual: దీపం పెట్టేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించి పెట్టాలా లేక అగరుబత్తీతో పెట్టాలా అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవాలంటే ముందు ఈ ఆచారం గురించి తెలియాలి. పూర్వం రుషులు హోమాలు యాగాలు చేసే సమయంలో ఆరణ్యం అనే ఓ కర్ర ఉండది. ఆ కర్రను మదిస్తే అగ్గి పుట్టేది. ఆ అగ్గితోనే హోమం చేసేవారు. అలా తరాలు మారే కొద్దీ అగరుబత్తులతో వెలిగించడం వంటివి చేసేవారు. అయితే అగరుబత్తితో వెలిగించినా అగ్గిపుల్లతో వెలిగించినా ముఖ్యంగా ఉండాల్సింది భక్తి. ఒకవేళ మీరు అగ్గిపుల్లతో ఒక దీపం వెలిగించినట్లైతే.. మిగతా దీపాలను ఆ దీపంతోనే వెలిగిస్తే మంచిది.