Spiritual: మ‌ధ్యాహ్నం పడుకుని సాయంత్రం పూజ చేయ‌చ్చా?

can one do puja after sleeping in the afternoon

Spiritual: మ‌ధ్యాహ్నం నిద్ర‌పోయి సాయంత్రం లేచాక సంధ్యా స‌మ‌యంలో పూజ చేసుకోవ‌చ్చా లేదా అని చాలా మంది సందేహం ఉంటుంది. కొంద‌రేమో అలా నిద్ర‌పోయి లేచి చేయ‌కూడ‌దు అంటారు. ఇంకొంద‌రు చేసుకోవ‌చ్చు అంటారు. మ‌రి ఇందులో ఏది నిజం?

మ‌నం ఎలాగైతే రాత్రి ప‌డుకుని ఉద‌యాన్నే లేచి పూజ చేసుకుంటామో మ‌ధ్యాహ్నం పూట కాసేపు నిద్ర‌పోయి సాయంత్రం పూజ చ‌క్క‌గా చేసుకోవ‌చ్చు. అందులో ఎలాంటి అశుభం లేదు. కాక‌పోతే సాయంత్రం సంధ్యా స‌మ‌యంలో నిద్ర‌పోవ‌డం.. ఆ స‌మ‌యంలో ఇల్లు ఊడ్చి పూజ చేయ‌డం వంటివి చేయ‌కూడ‌దు.