Back Pain: 2050 నాటికి 80 కోట్ల నడుం నొప్పి కేసులు!
Hyderabad: 2050 నాటికి దాదాపు 80 కోట్ల మంది నడుం నొప్పితో (back pain) బాధపడుతుంటారని ఓ సర్వేలో వెల్లడైంది. జర్నల్ లాన్సెట్ రుమటాలజీ (lancet journal rheumatology) నిర్వహించిన సర్వే ప్రకారం 2017 నుంచి 2020 వరకు నడుం నొప్పి (back pain) కేసులు ఇండియాలో 50 కోట్లు దాటాయని తేలింది. 2020లోనే బ్యాక్ పెయిన్ కేసులు 61.9 కోట్ల కేసులు నమోదయ్యాయి. అందులోనూ ఏషియా (asia), ఆఫ్రికా (africa) ఖండాల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నాయట. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో డిసేబులిటీకి ప్రధాన కారణం నడుం నొప్పే అని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ 1990 నుంచి 2020 డేటా ఆధారంగా 204 దేశాలకు చెందినవారితో సర్వే నిర్వహిస్తే.. 2050 నాటికి నడుం నొప్పి (back pain) బారిన పడే వారి సంఖ్య 80 కోట్లకు దాటుతుందని తేలింది. ఈ బ్యాడ్ పెయిన్ వల్ల షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, ఇతర మానసిక రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కుర్చీలకు అతుక్కుపోయి ఉద్యోగాలు చేసేవారికే బ్యాక్ పెయిన్ వస్తుందన్న అపోహలో ఉన్నారని బ్యాక్ పెయిన్ అనేది ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.