Akshaya Tritiya: ఇవి కొంటే ఎంతో మంచిదట
Hyderabad: ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయను(akshaya tritiya) జరుపుకుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. సంస్కృతంలో అక్షయ అంటే ‘శాశ్వతమైన, అంతులేని ఆనందం, విజయమని పేర్కొన్నారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ అక్షయ తృతీయ నాడు ఈ 10 వస్తువులు కొంటే ఎంతో శుభమని అంటున్నారు నిపుణులు. అవేంటంటే..
- అక్షయ తృతీయ అంటే అందరికీ మొదట బంగారం కొనాలన్న ఆలోచనే వస్తుంది. అక్షయ తృతీయ నాడు పసిడి కొంటే ఎంతో మంచిదని చెబుతుంటారు. ఆ రోజున బంగారు దుకాణాల్లో ఎన్నో ప్రత్యేక ఆఫర్లు కూడా పెడుతుంటారు.
- పసిడిలాగే వెండిని కూడా లక్ష్మీదేవికి సమానంగా భావిస్తారు. వెండి సామాన్లు, కాయిన్లు కొంటే ఎంతో మంచిది. అక్షయ తృతీయనాడు ఇష్టమైన వారికి వెండి సామాన్లు కానుకగా ఇస్తుంటారు.
- రియల్ ఎస్టేట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, ఏదైనా ప్రాపర్టీ, ల్యాండ్, ఇల్లు కొంటే సకలశుభాలు కలుగుతాయని నమ్మకం.
- స్టాక్స్‌లో ఇన్‌వెస్ట్ చేయడం కూడా శుభకరంగా భావిస్తారు. షేర్స్, మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయని నమ్మకం.
- ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొన్నా మంచిదే. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి కొనాలనుకుంటే అక్షయ తృతీయ నాడు కొనిపెట్టుకోండి. అంతేకాదు వాహనాల కొనుగోలుకు కూడా ఇది అనువైన రోజు.
- రైతులు పంటలు బాగా చేతికి రావాలని కావాల్సిన సామాగ్రిని అక్షయ తృతీయనాడు కొనాలని భావిస్తుంటారు.
- దుస్తులు కొనుక్కుని అదే రోజున ధరిస్తే ఎంతో మంచిదట. పుస్తకాలు కొన్నా ఎంతో మంచిది.
- కొనుక్కోవడం వరకే కాదు… ఈ అక్షయ తృతీయ నాడు పేదవారికి దానం చేసినా ఎంతో పుణ్యం.