Vinayaka Chavithi: ఈ వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుందట!
Vinayaka Chavithi: సెప్టెంబర్ 7న వినాయక చవితి. ఆరోజున కొన్ని రకాల వస్తువులు తెచ్చుకుంటే అదృష్టం వరిస్తుందని వాస్తు శాస్త్రం చెప్తోంది.
వెదురు మొక్క – కనీసం మూడు కాడలు ఉన్న లక్కీ బాంబూ (వెదురు) మొక్కను తెచ్చి పెట్టుకుంటే ఎంతో మంచిది. దీనిని ఈశాన్య భాగంలో పెట్టుకోవాలి.
కలశం – ఇది తెచ్చుకుని అందులో నీళ్లు పోసి పువ్వులు, మామిడి ఆకులు వేస్తే ఎంతో మంచిది. దీనిని ప్రధాన ద్వారం దగ్గర ఆగ్నేయ దిశగా పెట్టుకోవాలి.
యంత్రం – శుభం లాభం అనే యంత్రం దొరుకుతుంది. ఉత్తరం లేదా తూర్పు దిక్కులో ఈ యంత్రాన్ని పెట్టుకుంటే ఇంట్లో సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
గంట – పంచదాతువులతో తయారుచేసిన గంట తెచ్చి పెట్టుకున్నా మంచిదే. ఇది ఈశాన్య భాగంలో పెట్టుకుంటే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది.
కమలం – గణనాథుడి విగ్రహం దగ్గర కమలం పువ్వు పెట్టుకుంటే మంచిది
నాణేలు – వినాయక చవితి రోజున వెండి లేదా బంగారు నాణేలు తెచ్చిపెట్టుకోండి. వినాయకుడి వద్ద ఆగ్నేయం వైపు వాటిని ఉంచితే మంచిది.