Job Offer: ఇలాంటి కంపెనీలతో జాగ్రత్త..!
Hyderabad: జాబ్స్ కోసం వెతుకుతున్న ఓ అమ్మాయికి ఓ వందేళ్ల చరిత్ర నుంచి పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది (job offer). కంపెనీ నోయిడాలో ఉంది కానీ వర్క్ ఫ్రం హోం అని చెప్పడంతో ఓకే అనింది. ఆ తర్వాత వారానికే ఫస్ట్ ఇంటర్వ్యూ రౌండ్ అటెండ్ అయింది. అందులో పాస్ అవడంతో అదే వారంలో వరుసగా 3 రౌండ్ల ఇంటర్వ్యూ చేసారు. అందులో ఒకరు అమెరికా నుంచి ఇంటర్వ్యూ చేయడంతో రాత్రి 9 గంటలకు అటెండ్ అయింది. అన్నిటిలో ఆ అమ్మాయి పాస్ అయింది. ఎప్పుడెప్పుడు ఆ శుభవార్త చెప్తారా అని ఎదురుచూస్తుంటే.. అదే కంపెనీ నుంచి ఓ సీనియర్ హెచ్ఆర్ ఫైనల్ రౌండ్ అంటూ కాల్ చేసాడు. సరే అని అటెండ్ అయితే.. వర్క్ ఫ్రం హోం కాకుండా ఆఫీస్‌కి వచ్చే వారి కోసం చూస్తున్నాం అని చెప్పాడు. మరి ఈ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు అంటే.. రీపోర్టింగ్ మేనేజర్‌తో మాట్లాడి ఏ విషయం అనేది త్వరలో చెప్తాం అన్నారు.
సరే అని ఎదురుచూసింది. వారం రోజుల తర్వాత హెచ్ఆర్ ఫోన్ చేసి హైరింగ్ ప్రాసెస్ చాలా కఠినంగా ఉంటుంది. ప్రొసీడ్ అవ్వడానికి ముందు పని చేసిన కంపెనీల నుంచి చెరో రెండు రిఫరెన్స్ మెయిల్స్ కావాలని అడిగారు. ఆ అమ్మాయి రిఫరెన్స్ మెయిల్స్‌కి కావాల్సిన అన్ని వివరాలు పంపించింది. ఆ తర్వాత నెల రోజులు అవుతున్నా ఆ కంపెనీ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. పాపం ఆ అమ్మాయి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మాటి మాటికీ ఫోన్ చేస్తోందని బ్లాక్ చేసేసారు. దాంతో ఆ అమ్మాయి చాలా బాధపడింది. సరేలే అని వేరే జాబ్ వెతుక్కుంటున్న క్రమంలో అదే కంపెనీ నుంచి హెచ్ఆర్ ఫోన్ చేసింది.
మీరు మాటి మాటికీ ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదంటే వేరే పనిలో ఉన్నానని అర్థం చేసుకోవాలి కదా అని రివర్స్‌లో ఆ అమ్మాయినే తిట్టారట. రెండు నెలలుగా ట్రై చేస్తున్నా లిఫ్ట్ చేయలేనంత బిజీగా ఉన్నారని తెలీదండి సారీ అని చెప్పింది. ఆ తర్వాత రిఫరెన్స్ మెయిల్స్ పంపితే రెండు కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు రిప్లై ఇవ్వలేదని, అలాంటప్పుడు ఆఫర్ లెటర్ ఇవ్వలేమని చెప్పింది. దాంతో ఆ అమ్మాయి షాకైంది. హెచ్ఆర్ రిప్లై ఇవ్వకపోతే నా తప్పేముంది అని అడిగింది. దానికి కూడా సరిగ్గా సమాధానం చెప్పకుండా ప్రస్తుతానికి కంపెనీలో పొజిషన్ హోల్డ్‌లో ఉంచాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
ఒకప్పుడు ఊరు పేరు లేని కంపెనీలు, మోసం చేయాలనుకునే కంపెనీలు ఇలా ఉద్యోగుల టైం వేస్ట్ చేస్తూ ఆఫర్ లెటర్ ఇవ్వకుండా దొంగతిరుగుడు పనులు చేసేవి. ఇప్పుడు పేరున్న బడా కంపెనీలు కూడా ఇలాంటి పనులు చేస్తున్నాయి. అందుకే ఏదైనా కంపెనీకి అప్లై చేసుకునేందుకు దానికి సంబంధించిన రివ్యూలను బాగా చదవండి. అందుకు మీకు ఆంబిషన్ బాక్స్, గ్లాస్ డోర్ వంటి వెబ్‌సైట్స్ ఉపయోగపడతాయి. ఒకవేళ రివ్యూలు దొరకకపోతే లింక్డిన్లో ఆల్రెడీ పనిచేస్తున్నవారిని అడిగి చూడండి. దీని వల్ల అనవసరంగా మీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది.