Linkedin: పెరిగిపోతున్న‌ ఫేక్ జాబ్స్.. ఇలా జాగ్ర‌త్త‌ప‌డండి!

Hyderabad: ఉద్యోగాల కోసం వెతికే పోర్ట‌ల్స్‌లో లింక్డిన్ (Linkedin) టాప్ స్థానంలో ఉంది. వివిధ ర‌కాల ఉద్యోగాల‌ను వెతుక్కోవడానికే కాదు ఇత‌ర ఎంప్లాయీస్‌తో నెట్‌వ‌ర్క్ పెంచుకోవ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే ఇప్పుడు ఈ లింక్డిన్‌లో (Linkedin) ఫేక్ ఉద్యోగాలు ఎక్కువ అవుతున్నాయ‌ట‌. దాంతో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు నిపుణులు. దేశవ్యాప్తంగా ఉండే స్కామ్స్‌లో ఫేక్ జాబ్ (fake jobs) స్కాంలు 48% ఉంద‌ట. నార్డ్ లేయ‌ర్ అనే నెట్‌వ‌ర్క్ సెక్యూరిటీ సొల్యూష‌న్ ప్రొవైడ‌ర్ చేప‌ట్టిన స‌ర్వే ప్ర‌కారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 56% బిజినెస్‌లకు లింక్డిన్‌లో ఏదో ఒక ఫేక్ జాబ్ ఎదురైందట‌. నిజాయ‌తీగా జాబ్ ఆఫ‌ర్లు ఇస్తున్న‌ట్లు అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఉద్యోగాల కోసం వెతుకున్న‌వారి నుంచి ప‌ర్స‌న‌ల్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ తీసుకోవ‌డం, ఈ జాబ్‌కి అప్లై చేయాలంటే ఇంత డ‌బ్బు క‌ట్టాల‌ని చెప్పి మోసాల‌కు పాల్పడుతున్నారు.

లింక్డిన్‌లో  సెకెండ్‌కి 117 జాబ్ అప్లికేష‌న్లు వ‌చ్చి ప‌డుతుంటాయి. దాంతో ఇలా ఫ్రాడ్ల‌కు పాల్ప‌డేవారికి మోసం చేయ‌డం మ‌రింత సులువు అవుతోంది. ఈ లింక్డిన్ పోర్ట‌ల్ ద్వారా ఫిషింగ్‌కు పాల్ప‌డేవారు కూడా ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీల్లో ప‌నిచేస్తున్నామ‌ని చెప్పి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటారు. ఆ ప్రొఫైల్ నుంచి మిగ‌తావారితో క‌నెక్ట్ అవుతారు. క‌నెక్ట్ అయ్యాక వారితో ప‌రిచ‌యం పెంచుకుని ఈ లింక్ మీద క్లిక్ చేసి జాబ్‌కి అప్లై చేసుకోండి అని చెప్తారు. పాపం తెలీని వారు ఉద్యోగం వ‌స్తుంద‌న్న ఆశ‌తో క్లిక్ చేసేస్తారు. అలా ఖాతా నుంచి డ‌బ్బులు లాగేసుకుంటారు. అయితే ఈ ఫ్రాడ్స్ నుంచి చిన్న కంపెనీలు సేఫ్‌గానే ఉన్నాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్న‌వారు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విష‌యం ఏంటంటే.. ఎవ‌రైనా ఫ‌లానా జాబ్ ఉంది అని చెప్పి మీ నుంచి ప‌ర్స‌న‌ల్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ లాగాల‌ని చూస్తే న‌మ్మ‌కండి. అంటే మీ ఆధార్‌, ప్యాన్ నెంబ‌ర్లు వంటివి అడిగితే వారు ఫ్రాడ్స్ అని అర్థం. ఇలాంటి విష‌యాల్లో కాస్త అప్ర‌మ‌త్తంగా ఉండండి.