Kamadhenu: ఈ విగ్రహం ఇంట్లో లేకపోతే వెంటనే తెచ్చి పెట్టుకోండి
Kamadhenu: కామధేను.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన విగ్రహం ఇది. గోమాత తన బిడ్డకు పాలు ఇస్తున్నట్లు కనిపించే ఈ విగ్రహం ఇంట్లో ఉంటే వాస్తు ప్రకారం ఎంతో మంచిదట. మన పురాణాల ప్రకారం కామధేను విగ్రహాన్ని పూజిస్తే ఎంతో మంచిది. కోరిన కోర్కెలు నెరవేరుస్తుందట. కామధేనుని సురభి అని కూడా అంటారు. స్వచ్ఛమైన ప్రేమకు అమ్మతనానికి ప్రతీక ఈ కామధేను.
కామధేను విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు
*కామధేను విగ్రహంలో లక్ష్మీదేవి, సరస్వతి, దుర్గాదేవి కొలువై ఉంటారు. కామధేనుని పూజిస్తే ఈ అమ్మవార్లను పూజించినట్లే.
*కెరీర్, బిజినెస్, ఉద్యోగాలు ఇలా అన్నింట్లో విజయాన్ని అందుకునేలా చేస్తుంది. ఆధ్యాత్మికతలోని ప్రశాంతతను పరిచయం చేస్తుంది.
*కామధేను పిల్లని అంటే దూడని నందిని అంటారు. ఈ రెండింటినీ కలిపి పూజిస్తే సంతానం లేనివారికి త్వరగా పిల్లలు కలుగుతారు.
*జీవితం ఎటు పోతోందో తెలీని పరిస్థితుల్లో ఉన్నవారు.. తెలీని బాధతో మానసికంగా కుంగిపోతున్నవారు ఒక కామధేను విగ్రహాన్ని తెచ్చి శుక్రవారం రోజున పూజ గదిలో ప్రతిష్ఠిస్తే అంతా మంచే జరుగుతుంది.
*ప్రతి సోమవారం వ్యాపారం చేసేవారు కామధేను విగ్రహాన్ని పూజిస్తే లాభాలను అర్జిస్తారు. షాపుల్లో కానీ ఆఫీసుల్లో కానీ కామధేను విగ్రహాన్ని పెట్టుకోవాలంటే నైరుతి దిక్కున పెట్టుకుంటే మంచిది.