Lord Shiva: ఈ మంత్రాన్ని జపిస్తే ఎంత మంచిదో తెలుసా?
ఓం నమఃశివాయ.. ఈ మంత్రాన్ని విన్నా జపించినా ఎంతో మంచిది. మనసుకు సాంత్వన కలుగుతుంది. ప్రశాంతత లభిస్తుంది. అసలు ఈ మంత్రాన్ని జపించడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. (lord shiva)
నెగిటివ్ ఎనర్జీ పోతుంది
ఈ మంత్రాన్ని జపించడం ద్వారా కొన్ని గ్రహాల వల్ల కలిగే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఎందుకంటే శివతత్వం అనేది బ్రహ్మాండానికే గురువు లాంటిది. అన్ని గ్రహాలను అదుపులో ఉంచే శక్తి ఈ శివ మంత్రానికి ఉంది.
ఇంద్రియాలు నియంత్రణలో ఉంటాయి
ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మన ఇంద్రియాలు మన అదుపులోనే ఉంటాయి. దీని వల్ల మున్ముందు మన ఆలోచనలు, కోరికలపై కూడా అదుపు వస్తుంది. (lord shiva)
విజన్‌పై క్లారిటీ వస్తుంది
శివ మంత్రాన్ని రోజూ జపించడం ద్వారా మనం భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నామో దానిపై పూర్తి అవగాహన క్లారిటీ వస్తుందట.
మెదడు పనితీరు మెరుగుపడుతుంది
శివ మంత్రాన్ని జపించడం ద్వారా మన మనసు, మెదడు రిలాక్స్ అవుతాయి. అప్పటివరకు మనకున్న బాధలను మరిచి వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న ఆలోచన పడుతుందట.