మంచి కెరీర్, స‌క్సెస్ కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి

కెరీర్‌లో రాణించాల‌ని స‌క్సెస్‌ఫుల్ జీవితాన్ని గ‌డ‌పాల‌ని ఎవరికి మాత్రం ఉండ‌దు? ఒక కెరీర్‌ని ఎంచుకోవాలన్నా దానిలో స‌క్సెస్ అవ్వాల‌న్నా ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. అసలు మ‌నం ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి అనేది కూడా ఒక పెద్ద టాస్కే. జ్యోతిష్యశాస్త్రం ప్ర‌కారం మ‌న జాత‌కాన్ని బ‌ట్టే మ‌నం ఏ కెరీర్‌లో (career) రాణించ‌గ‌లుగుతాం అనేది ఉంటుంది.

మీ జాతకం చూపించుకోండి

మీరు ప్ర‌స్తుతం ఎంచుకున్న కెరీర్ బాగుంటే.. అందులో విజ‌యం సాధిస్తుంటే ఏం ప‌ర్వాలేదు. కానీ ఏ కెరీర్ ఎంచుకున్నా కూడా ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా నిల‌క‌డ‌లేక‌పోవడం, డ‌బ్బులు దాచుకోలేక‌పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లైతే ఒక‌సారి మీ జాతకాన్ని చూపించుకోవ‌డం మంచిది. అలా అని ఎవ‌రు ప‌డితే వారి ద‌గ్గ‌రికి వెళ్ల‌కండి. ఒకసారి మీ త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యుల‌ను సంప్ర‌దించి వారి స‌లహా కూడా తీసుకుంటే మంచిది. బ‌హుశా మీరు మీ జాత‌కాన్ని త‌గిన కెరీర్‌ను ఎంచుకోలేదేమో..! (career)

టైమింగ్ ముఖ్యం

స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవాల‌న్నా.. ఆ ఆలోచ‌న రావాలన్నా కూడా స‌రైన స‌మ‌యం రావాలంటారు. జ్యోతిష్య నిపుణుల‌కు మీ జాతకం చూపిస్తే ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాలో వారే మీకు గైడ్ చేస్తారు.

జాతిర‌త్నాలు

మీ జాత‌కం ప్ర‌కారం జ్యోతిష్య నిపుణులు కొన్ని జాతిర‌త్నాల‌ను సిఫార‌సు చేస్తారు. వాటిని ఎలా ప‌డితే అలా పెట్టుకుంటే ప్ర‌మాదం. మీకు న‌మ్మ‌కం లేక‌పోతే వ‌దిలేయండి కానీ.. ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా జాతిర‌త్నాల‌ను వాడ‌కండి. (career)

స‌త్వ‌ర నిర్ణ‌యాలు ప్ర‌మాద‌క‌రం

ఒక‌టి పోతో ఇంకొక‌టి అనుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు ఆలోచ‌న‌లు, కెరీర్‌లు మార్చేయ‌కండి. జ్యోతిష్య‌శాస్త్రం ప్ర‌కారం తొంద‌ర‌పాటులో తీసుకునే నిర్ణ‌యాలు మీ జాత‌కంతో స‌రితూగ‌క‌పోతే న‌ష్టాలు వ‌స్తాయి.

స‌ల‌హాలు పాటించాల్సిందే

ఒక‌వేళ మీరు జాత‌కం చూపించుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటే.. జ్యోతిష్య నిపుణులు మీ జాత‌కానికి త‌గ్గ‌ట్లు కొన్ని మంత్రాలు జపించాల‌ని, జాతిర‌త్నాల‌ను పెట్టుకోవాల‌ని చెప్తుంటారు. ఇవి చాలా కీల‌కం. ఇలాంటివి చాలానే చూసాం అనుకుంటే అది మీ ఇష్టం. కానీ పాటించాలి అనుకుంటే మాత్రం నిపుణుల స‌ల‌హాలు అస్స‌లు పెడ‌చెవిన పెట్ట‌కండి. (career)