ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీకు ప్రేమ వివాహం అవుతుంది

Spiritual: జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం కొన్ని ర‌కాల సంకేతాలు క‌నిపిస్తే వారికి ప్రేమ వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని అర్థ‌మట‌. ఇంత‌కీ ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం.

శుక్రుడు, చంద్రుడు

మీ జాత‌కంలో శుక్ర‌, చంద్ర బలం బాగా ఉంటే మీకు జీవితంలో ప్రేమ వివాహం అవుతుంద‌ని అర్థం. ఎందుకంటే శుక్రుడు ప్రేమ‌కు, చంద్రుడు ఎమోష‌న్స్‌కు గుర్తు. ఈ రెండు మీ జాత‌కంలో బాగుంటే మీ వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ జాత‌క‌చక్రంలో శుక్రుడు ఐదు లేదా ఏడో స్థానంలో ఉంటే క‌చ్చితంగా ల‌వ్ మ్యారేజ్ అవుతుంద‌ని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది.

క‌ల‌లు

కొన్నిసార్లు మ‌న‌కు వ‌చ్చే క‌ల‌లు ఎలా ఉంటాయంటే ఈ బ్ర‌హ్మాండం మ‌న‌కు ఏదో చెప్పాల‌నుకుంటోంది అనిపిస్తుంది. మీకు క‌ల‌లో మీ భాగ‌స్వామికి సంబంధించిన అంశాలు కానీ.. ప్రేమ‌కు సంబంధించిన అంశాలు కానీ క‌నిపిస్తున్నాయంటే ల‌వ్ మ్యారేజ్ కాబోతోంద‌ని అర్థం.