Spiritual: పూజ గ‌దిలో ఈ త‌ప్పు చేస్తున్నారా? మంచిది కాదు సుమీ

are you doing this mistake in puja room

Spiritual: ఈ మ‌ధ్య‌కాలంలో స‌మ‌యం లేక‌నో.. లేక ఓపిక లేక‌నో దేవుడి గ‌దిలో దీపాలు కాకుండా ఏవో చిన్న లైట్లు వేసి పెట్టేస్తున్నారు. దాన్నే దీపంలా భావిస్తున్నారు. అలా ఎప్పుడూ చేయ‌కండి. దీపానికి ఉండే శ‌క్తి అంతా ఇంతా కాదు. ఉద‌యం, సాయంత్రం ఎప్పుడూ ఇంట్లో దీపం పెడుతూ ఉండాలి. ఒక స‌రైన స‌మ‌యాన్ని ఎంచుకుని రోజూ ఆ స‌మ‌యానికి దీపం పెట్టేస్తూ ఉండండి. ఇంటి ఇల్లాలు దీపం పెడితే ఎంతో మంచిది. ఒక‌వేళ ఇల్లాలికి ఏద‌న్నా అనారోగ్య స‌మస్య ఉంటే ఆడ‌పిల్ల‌లు, భ‌ర్త అయినా పెట్ట‌చ్చు. పూజ గ‌దిలో దీపం పెట్టాక కాసేపు అలాగే కూర్చుని ఉండండి. మీకు ఆ స‌మ‌యంలో క‌లిగే అనుభూతి లైటు వేస్తే మాత్రం అస్స‌లు క‌ల‌గ‌దు. దీపానికి ఉన్న శ‌క్తి అలాంటిది మ‌రి.