Rent House: అద్దె ఇంట్లోకి వెళ్లాక పాలు పొంగిస్తున్నారా?

are you boiling milk in rent houses

Rent House: సాధార‌ణంగా చాలా మంది అద్దె ఇంట్లోకి ప్ర‌వేశించగానే తొలి రోజు పాలు పొంగిస్తుంటారు. అస‌లు ఇలా అద్దె ఇంట్లో పాలు పొంగించ‌వ‌చ్చా? ఏ తిథుల్లో ఇంట్లోకి మారితే మంచిది వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం.

అద్దె ఇంట్లోకి కానీ సొంతింట్లోకి కానీ మారాల‌నుకునేవారు శ్రావ‌ణం, భాద్ర‌ప‌దం, ఆషాఢ మాసాల్లో మారితే మంచిది.

పాడ్య‌మి, పంచ‌మి, విదియ‌, త‌దియ‌, సప్త‌మి, ద‌శ‌మి, ఏకాద‌శి, ద్వాద‌శి వంటి తిథుల్లో ఇంట్లోకి మారవ‌చ్చు

పైన చెప్పిన తిథుల్లో శుక్ర‌వారం క‌లిసొస్తే మ‌రీ మంచిది.

సోమ‌వారం, మంగ‌ళ‌వారాల్లో మాత్రం అద్దె ఇంట్లోకి ప్ర‌వేశించ‌కూడ‌దు

అద్దె ఇంట్లోకి వెళ్ల‌గానే పాలు పొంగించేస్తుంటారు. కానీ అలా పొంగించ‌కూడ‌ద‌ట. అలా పాలు పొంగిస్తే ఆ ఇంటి య‌జ‌మానికి క‌లిసొస్తుంది కానీ బాడుగ‌కు ఉండేవాళ్ల‌కు కాదు. పైగా ఇలా పాలు పొంగిస్తే సొంతింటి క‌ల నెర‌వేర‌దు అని కూడా అంటుంటారు.

కాబ‌ట్టి.. అద్దె ఇంట్లోకి మారాల‌నుకునేట‌ప్పుడు మంచి రోజు, తిథి చూసుకుని మారితే స‌రిపోతుంది. కావాలంటే ఆరోజున ఆ ఇంట్లో దీపం పెట్టి అంతా మంచే జ‌ర‌గాల‌ని న‌మ‌స్క‌రించుకునే మంచిది.