Spiritual: ఇంట్లో చీమలు.. దేనికి సంకేతం?
చీమలు (ants) తిరగని ఇల్లు ఉండదు. చిన్నప్పుడు నల్ల చీమలు ఇంట్లో తిరిగితే అవి మంచివని.. ఎర్ర చీమలు చెడ్డవని అనుకునేవాళ్లం. అసలు ఇంట్లో చీమలు తిరిగే దేనికి సంకేతమో తెలుసుకుందాం. (spiritual)
*ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే అది మంచి శకునమే. త్వరలో ధనం అందుతుందని సూచిస్తున్నట్లు అర్థం. మీరు నమ్ముకున్న పనిని.. లక్ష్యాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు అని నల్ల చీమలు మీకు గుర్తుచేస్తుంటాయట.
*మనం చిన్నప్పుడు అనుకున్న విషయం నిజమే. ఎర్ర చీమలు అశుభం. అవి ఇంట్లో ఎక్కువగా ఉన్నాయంటే ధనవ్యయం అవుతూ ఉంటుంది.
*చీమలు పడమర దిశ వైపు నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయంటే విదేశీయానం ఉన్నట్లు. అదే అవి తూర్పు వైపు నుంచి వస్తున్నాయంటే అశుభం.
*నల్ల చీమలు ప్రశాంతతను పెంపొదిస్తాయి.
*చీమలు ఉత్తర దిశ నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయంటే.. సంతోషానికి సూచకం. మీరు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషాన్ని కలిగి ఉంటారని అర్థం.
*బియ్యం ఉన్న డబ్బాలో నుంచి నల్ల చీమలు బయటికి వస్తున్నాయంటే త్వరలో ఆర్థికంగా లాభపడనున్నారని అర్థం. అంటే త్వరలో ఏదో మంచి లాభం చేకూర్చే పని చేయబోతున్నారని సూచన.