ఇంట్లో ఎలాంటి జంతువుల ఫోటోలు పెట్టుకోవాలి?
ఇంట్లోని గోడలు అందంగా కనిపించాలని రకరకాల ఫోటోలను పెట్టుకుంటాం. కొందరైతే వాస్తు ప్రకారం ఎలాంటి ఫోటోలు పెట్టుకుంటే మంచి జరుగుతుందో అవే పెట్టుకుంటారు. అసలు వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి జంతువుల ఫోటోలు ఉండాలి? (spiritual)
ఆవు (cow)
గోమాత శుభానికి సూచకం. ఆవులకు సంబంధించిన ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు ప్రకారం ఇంటికి ఎంతో మంచిది. ఫోటోలుగా కానీ లేదా ఆవు దూడకు పాలు ఇస్తున్నట్లు ఉండే బొమ్మలు కానీ ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది.
ఏనుగు (elephant)
ఏనుగు అనగానే మనకు గణనాథుడు గుర్తుకొస్తాడు. ఏనుగుల బొమ్మలు లేదా ఫోటోలను ప్రవేశ ద్వారం వద్ద పెట్టుకుంటే మంచిది.
చేపలు (fish)
ఈశాన్య మూలలో అక్వేరియం కానీ చేపల బొమ్మలు కానీ పెట్టుకుంటే మంచిది. జంట చేపలు ఉండేలా చూసుకుంటే మరీ మంచిది. ఒకవేళ అక్వేరియం ఉన్నట్లైతే అందులోని చేపలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చేపలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. (spiritual)
తాబేలు (tortoise)
అత్యంత ఎక్కువ కాలం జీవించే జంతువుల్లో తాబేలు ఒకటి. ఇది ఇంట్లో ఉంటే స్థిరత్వం ఉంటుంది. అందుకే చాలా మంది గాజుతో తయారుచేసిన తాబేలు బొమ్మని నీళ్లల్లో వేసి పెట్టుకుంటారు. మరికొందరు తాబేలు ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. తాబేలు బొమ్మను కానీ ఫోటోను కానీ ఇంట్లో లేదా కార్యాలయంలో ఉత్తర దిక్కు వైపు ఉంచండి.
నెమలి (peacock)
కుమారస్వామి వాహనం అయిన నెమలి మనకు జాతీయ పక్షి. ఇంట్లో నెమలి పెయింటింగ్స్ ఉన్నా నెమలి పింఛాలు ఉన్నా పాజిటివిటీ ఉంటుంది.