Spiritual: రావ‌ణాసురుడి హెలీప్యాడ్ గురించి తెలుసా?

Spiritual: రావ‌ణాసురుడు శివ‌య్య‌కు అమిత భ‌క్తుడు. వెయ్యి సంవ‌త్స‌రాల పాటు శివ‌య్య‌ను మెప్పించేందుకు రావ‌ణాసురుడు చేయ‌ని ప‌నంటూ లేదు. మొత్తానికి శివ‌య్య అనుగ్ర‌హం పొందిన రావ‌ణాసురుడు త‌న‌తో పాటు శివ‌య్య‌ను లంక‌కు రావాల‌ని కోరాడట‌. ఇందుకు శివ‌య్య కూడా ఒప్పుకున్నాడు కానీ తాను లింగం రూపంలో వ‌స్తాన‌ని చెప్పాడ‌ట‌. ఇందుకు రావ‌ణాసురుడు కూడా స‌రేన‌న్నాడు. అయితే ఇక్క‌డ శివుడు ఒక ష‌ర‌తు పెట్టాడు. లింగం ఆకారంలో ఉన్న త‌న‌ను మోసుకెళ్తూ ఎక్క‌డైనా చేజారి ప‌డేస్తే తాను అక్క‌డే వెలుస్తాన‌ని చెప్పాడు. ఆ త‌ర్వాత త‌నను అక్క‌డ నుంచి త‌ర‌లించ‌కూడ‌దు అన్నాడు. ఇందుకు కూడా రావ‌ణాసురుడు ఒప్పుకున్నాడు.

అలా ఝార్ఖండ్‌లోని దేవోగ‌డ్‌లో ఉన్న త్రికుట్ కొండ‌ల మీద నుంచి రావ‌ణాసురుడు లింగాన్ని మోసుకెళ్లాడు. ఆ స‌మ‌యంలో రావ‌ణాసురుడు అల‌సిపోయి కాసేపు విశ్రాంతి తీసుకోవాల‌నుకున్నాడు. ఆ స‌మ‌యంలో బాలుడి రూపంలో ఉన్న వినాయ‌కుడ గొర్రెల కాప‌రిగా క‌నిపిస్తే ఆ బాలుడిని పిలిచి తాను కాసేపు విశ్రాంతి తీసుకుంటాన‌ని అంత‌వ‌ర‌కు లింగాన్ని ప‌ట్టుకోవాల‌ని కోరాడు. అలా రావ‌ణాసురుడు లింగాన్ని ఆ బాలుడికి ఇచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. కొంత‌సేప‌టి త‌ర్వాత చూస్తే ఆ బాలుడు లింగాన్ని నేల‌పై పెట్టేసాడు. దాంతో రావ‌ణాసురుడు ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. ఆ త‌ర్వాత లింగాన్ని ఎంత లేపాల‌ని చూసినా రావ‌ణాసురుడి వ‌ల్ల కాలేదు. అలా ఈ దేవోగ‌డ్ ప్రాంతంలో వెల‌సిన లింగాన్ని రావ‌ణేశ్వ‌ర లింగా అని పిలుస్తారు. ఈ త్రికుట ప‌ర్వ‌తాన్ని స్థానికులు రావ‌ణాసురుడి హెలీప్యాడ్ అని పిలుస్తార‌ట‌.