Ganga శివయ్య భార్యగా ఎలా మారింది? సరస్వతి శాపం వల్లేనా?
Ganga: మన దేశంలో నదులకు ఒక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం నదులు మొదట్లో స్త్రీ మూర్తులుగా ఉన్నాయి. ముఖ్యంగా గంగా నది. శివయ్య (Shiva) రెండో భార్యగా.. భగీరథకి తపస్సు ద్వారా దివి నుంచి భువికి దిగొచ్చింది అంటారు. అయితే గంగా దేవికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా గంగాదేవి రూపం వాహనంగా ఉండేది. అగ్ని పురాణం 50వ అధ్యయనంలో ఉంది ఈ విషయం. ఒక చేత్తో కుండ మరో చేత్తో కమలాలు పట్టుకుని తెల్లని ఆకారంలో మకరం, మత్య్సంపై విశ్రాంతి తీసుకునే ఆసనంలో గంగా దేవి ఉంటుంది. విష్ణువు తన వామన అవతారం ఎత్తినప్పుడు గంగాదేవి జననం జరిగింది. వామనుడి అవతారంలో ఉన్న విష్ణువు ముల్లోకాలను మూడు అడుగులతో కొలిచాడు. అప్పుడు అతని ఎడమ కాలికి ఉన్న గోళ్లు కాస్త ఎత్తుకు లేచాయి. ఆ గోళ్లు బ్రహ్మాండం పై భాగానికి ఒక రంధ్రం ఏర్పడేలా చేసాయి. ఏర్పడిన రంధ్రం నుంచి గంగ ఉద్భవించింది. బ్రహ్మాండం అంటే ఖాళీగా ఉండే అంతరిక్షం. మరి దానికి రంధ్రం ఏంటి అనుకుంటున్నారా?
పురాణాల్లో యూనివర్స్‌ని బ్రహ్మాండం అంటే బ్రహ్మ చేత సృష్టించబడ్డ అండం అని అర్థం. ఈ విశ్వం ఒక అండం. అంటే గుడ్డు ఆకారంలో ఉంటుంది భాగవతంలో కూడా రాసి ఉంది. ఆ ఆకారానికి విష్ణువు కాలి గోరు చేసిన రంధ్రం నుంచి గంగ ఉద్భవించి స్వర్గ లోకానికి చేరింది. భాగవతంలో విష్ణు పది అనే నదిని ప్రస్తావించారు. ఈ నదిలో ఉన్న నీరు విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలను కడిగే తీర్థం అంటారు. కాలగమనంలో ఈ విష్ణు పదే గంగగా మారిందని కూడా చెప్తారు.
ఒకానొక సమయంలో ధృవ మండలంలో విష్ణువు అడుగుపెడితే ఆ స్థలాన్ని విష్ణు పాద అని పిలవబడింది. అదే ఆ తర్వాత విష్ణు పదిగా మారింది. ధృవ మండలం.. అంటే మొదటి మనువంతరానికి పాలకుడైన స్వయంభు మను మనవడు ధృవుడు తపస్సు చేసిన ప్రదేశం. ఈ ధృవ మండలం చుట్టూ సప్త రుషుల ప్రదక్షిణలు చేసి ఈ పవిత్రమైన నదిలో స్నానం ఆచరించారు. అయితే ధృవ మండలంలో మొదలైన విష్ణు పది మొదట దేవయాన అంటే దేవతల విమానం ఉండే ప్రాంతం మీద పడుతుంది.
ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. రాయాయణంలో ఉన్న పుష్పక విమానం లాంటి ఎన్నో విమానాలు ఈ ప్రదేశంలో ఉంటాయి. ఆ తర్వాత చంద్ర మండలానికి చేరుకుని అక్కడ సీత చక్షు అలకనంద, భద్ర అనే నాలుగు పాయలుగా విడిపోతుంది. తర్వాత ఆ ప్రవాహం బ్రహ్మలోకానికి చేరుకుని అక్కడ అన్ని వైపులా ప్రవహిస్తుంది. విడిపోయిన నాలుగు పాయల విషయానికి వస్తే.. సీత మేరు పర్వత శిఖరం నుంచి కిందకు ప్రవహించి గంగ మదన పర్వతంపై పడుతుంది. ఆఖరిగా వర్షం ద్వారా తూర్పు సముద్రంలో కలుస్తుంది. రెండో పాయ చక్షు మాన్యవయ పర్వతాల నుంచి కేతు మాల మీదుగా ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిసిపోతుంది.
మూడో పాయ అలకనంద హేమకుట పర్వతం నుంచి భరత అనే వర్షం ద్వారా ప్రవహించి దక్షిణ సముద్రంలో కలిసిపోతుంది. నాలుగో పాయ భద్ర శృంగవాసు పర్వత శిఖరం నుంచి ఉత్తర కురు ప్రాంతంపై ప్రవహించి ఉత్తర సముద్రంలో కలిసిపోతుంది. ఈ నాలుగు ఉప నదుల్లో అలకనందను అన్నిటి కంటే పవిత్రమైనదిగా చెప్తారు. గంగ తాను జన్మించిన వేల సంవత్సరాల తర్వాత స్వర్గం నుంచి భూమికి చేరుకుంది.
గంగాదేవి శివుడి భార్యగా ఎలా మారింది?
ఈ ప్రశ్నకు వివిధ పురాణాల్లో ఎన్నో వివరణలు ఉన్నాయి. కానీ దేవి భాగవత పురాణంలో అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఆ పురాణం ప్రకారం శక్తి స్వరూపాలు ఎన్నో విధాలుగా వ్యక్తం అవుతాయి. ఆ సమయానికి దేవతల మధ్య ఇంకా సంబంధాలు ఏర్పడలేదు. అయితే వైకుంఠంలో ఉన్న మహా విష్ణువు, లక్ష్మి, సరస్వతి, గంగాదేవి వీరితో సంతోషంగా మాట్లాడుతున్న సమయంలో గంగ విష్ణువుపై ఇష్టంతో చూసింది. విష్ణువు కూడా అంతే ఇష్టంగా గంగను చూసాడు. ఇది గమనించిన సరస్వతి సహనంగా ఉండలేకపోయింది.
వెంటనే తాను కూర్చున్న చోట నుంచి పైకి లేచి గంగాదేవిని కొట్టింది. లక్ష్మీదేవి కలగజేసుకుని గొడవ పెద్దది కాకుండా సరస్వతిని ఆపడానికి ప్రయత్నించింది. జోక్యం చేసుకున్నందుకు సరస్వతికి కోపం వచ్చి లక్ష్మీ దేవిని భూమిపై పుట్టమని శపించింది. అప్పడు గంగ కోపంతో సరస్వతి భూమిపై నదిగా జన్మించాలని శపించింది అప్పుడు గంగను శపిస్తూ… నువ్వు కూడా భూమిపై నదిగా అవతరించి ప్రపంచం మొత్తంలో ఉన్న పాపాలన్నీ స్వయంగా స్వీకరిస్తావు అంది.
అలా ముగ్గురూ కోపాలు ప్రదర్శిస్తూ శపించుకున్న తర్వాత విష్ణువు వారితో మాట్లాడుతూ… మీ మధ్య జరిగిన మాటల్లో కారణం ఉంది కాబట్టే ఈ సంఘటన జరిగింది. లక్ష్మీ దేవి భూమిపై ధర్మ ధ్వజుడి ఇంట్లో పుట్టి అతని కుమార్తెగా పెరుగుతుంది. కానీ అతని భార్య గర్భం నుంచి జన్మించదు. లక్ష్మీ.. నీ వల్ల మూడు లోకాలు స్వచ్ఛంగా మారుతాయి. తర్వాత తులసి అనే మొక్కగా జన్మించి నాలో ఒక భాగం నుంచి పుట్టిన శంకచుగా అసురుడిని వివాహం చేసుకుంటావు. ఆ తర్వాత నువ్వు పద్మావతి ఒక పవిత్రమైన నదిగా మారుతావు. నది రూపాన్ని భూమిపై వదిలేసి దివ్య రూపంలో వైకుంఠానికి చేరుకుని నన్ను వివాహం చేసుకుంటావు. అని చెప్పారు. తర్వాత గంగతో నువ్వు భూమిపై ఒక పవిత్రమైన నదిగ అక్కడి మనుషుల పాపాలు పోగొట్టడానికి వెళ్తావు. భగీరథుడు నిన్ను భూమిపైకి తీసుకెళ్తాడు. అప్పటినుంచి నువ్వు భాగీరథి అని పిలవబడతావు. తర్వాత సంతన మహారాజు భార్యగా ఉంటావు. చివరిగా దివ్య స్వరూపంతో కైలాసానికి చేరుకుని శివుని భార్యగా స్థిరపడిపోతావు అని చెప్తాడు. ఈ విధంగా లక్ష్మీదేవి విష్ణు మూర్తికి, గంగ శివుడికి, సరస్వతి బ్రహ్మకు భార్యలుగా మారతారు.