Vinayaka Chavithi: 16 స్వరూపాలు 16 శ్లోకాలు 16 ప్రయోజనాలు
Vinayaka Chavithi: సెప్టెంబర్ 7న దేశమంతటా వినాయక చవితిని జరుపుకుంటుంది. బొజ్జ గణపయ్య రాకతో ఇళ్లన్నీ సంతోషాలతో నిండిపోతాయి. ఈ నేపథ్యంలో వినాయక చవితికి సంబంధించి మంత్ర శాస్త్రంలో చెప్పిన ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం. దీని వల్ల ఎవరి జీవితాలైనా ప్రయోజనం పొందుతాయి. ఇంతకీ ఆ విషయం ఏంటంటే..
గణపతికి 32 స్వరూపాలు ఉన్నాయి. అందులో శైవాగమాల్లో చెప్పినవి 16 స్వరూపాలు చాలా ముఖ్యమైనవి. ఈ 16 స్వరూపాలు 16 రకాల ప్రయోజనాలను ఇస్తాయి. మన జీవితాల్లో వచ్చే 16 కష్టాలు తీరుస్తాయి. అందులో ప్రతీ స్వరూపానికి ఒక ధ్యాన శ్లోకం ఉంది. అందుకని ఎవరైనా ఏ కులం వారైనా పెద్దవారైనా చిన్నావారైనా కూడా చేసుకోవచ్చు ఈ శ్లోకాన్ని. అది చేసుకుంటూ ఆ గణపతి ఆరాధిస్తే 7 రోజులు కానీ లేకపోతే 11 రోజులు కానీ చేయగలిగితే తప్పకుండా గణపతి అనుగ్రహం కలుగుతుంది. అవి ఏంటంటే..
బాల గణపతి
కరస్థ కదలీ చూత పనసేక్షుక మోదకమ్ బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్
పిల్లల చేత ఈ శ్లోకాన్ని 32 సార్లు చదివిస్తే బుద్ధి వికాసం వస్తుంది
తరుణ గణపతి
పాశాంకుశాపూప కపిద్ధజంబూ స్వదంతశాలీక్షు మపి స్వహస్తైః
ధత్తే సదాయ స్తరుణారుణాభః
పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః
ఈ స్తోత్రాన్ని 32 సార్లు పఠిస్తే కార్య సాధన సిద్ధి కలుగుతుంది.
భక్త గణపతి
నాలికేరామ్రకదలీ గుడపాయస ధారిణమ్
శరశ్చంద్రాభవపుషం భజే భక్తగణాదిపమ్
ఈ శ్లోకం 32 సార్లు చదివితే ఏకాగ్రత పెరుగుతుంది. భక్తి నిలుస్తుంది. అంటే మనం ఏదన్నా ఆరాధిస్తున్నప్పుడో మంత్రం చదువుతున్నప్పుడో ఆలోచనలు ఎటో వెళ్లిపోతుంటాయి. ఈ శ్లోకం చదివితే మనసు అటూ ఇటూ వెళ్లకుండా ఒకదానిపైనే ఫోకస్ చేసి ఉంటుంది.
వీరగణపతి
బేతాలశక్తి శరకార్ముకచక్రఖడ్గ
ఖడ్వాంగముద్గరగదాంకుశనాగపాశాన్
శూలంచ కుంత పరశుధ్వజ ముద్వహంతం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి
ఈ మంత్రాన్ని 32 సార్లు స్మరిస్తే ధైర్యం కలుగుతుంది
శక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరాశ్లిష్ట కటి ప్రదేశమ్
సంధ్యారుణం పాశసృణీ వహంతం
భయాపహం శక్తిగణేశ మీడే
ఈ మంత్రాన్ని 32 సార్లు చదివితే ఆత్మస్థైర్యం కలుగుతుంది.
ద్విజ గణపతి శ్లోకం
యం పుస్తకాక్ష గుణ దండకమండలు
శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం
త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య:
ఈ శ్లోకాన్ని పఠిస్తే మనిషిలో క్రియేటివిటీ, విభిన్న ఆలోచనా శక్తి పెరుగుతాయి
సిద్ధి గణపతి
పక్వచూతఫల పుష్పమంజరీ
చేక్షు దండతిల మోదకైస్సహ
ఉద్వహన్ పరశు హస్తతే నమః
శ్రీసమృద్ధియుత హేమపింగళః
ఈ శ్లోకాన్ని పఠిస్తే కార్యాలు సిద్ధించి విజేతగా నిలుస్తారు
ఉచ్ఛిష్గ్ట గణపతి
నీలాబ్ద దాడిమి వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:
ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఉచ్ఛరణలో ఎలాంటి తప్పులున్నా మంత్రం ఫలించదు. ఈ మంత్రం జపిస్తే కోరికలను వెంటనే సిద్ధింపజేస్తాడు.
విఘ్న గణపతి
శంఖేక్షుచాప కుసుమేషు కుఠారపాశ
చక్రస్వదంత సృణిమంజరి శరౌఘైః
పాణిశ్రితైః పరిసమీహిత భూషణశ్రీ విఘ్నేశ్వరో
విజయతే తపనీయగౌరః
ఈ శ్లోకాన్ని జపిస్తే ఏ పని చేసినా కలిసొస్తుంది.
క్షిప్ర గణపతి
దంతకల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం
ఈ శ్లోకాన్ని రోజూ 16 సార్లు చేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.
హేరంభ గణపతి
అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:
కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా
ప్రయాణాలు చేసే ముందు ఈ శ్లోకాన్ని 11 సార్లు ఆరాధిస్తే విఘ్నాలు ఎదురుకాకుండా ఉంటాయి.
లక్ష్మీ గణపతి
బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:
శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్
పేదరికంతో సతమతం అవుతున్న వారు రోజుకు 32 సార్లు ఈ శ్లోకాన్ని చదివితే ఆర్థికంగా కలిసొస్తుంది.
మహా గణపతి
హస్త్రీంద్రాననమిందు చూడమరుణచ్ఛాయం త్రినేత్రం రసాద్లాశిష్టం
ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతమ్
బీజూపుర గదేక్షు కార్ముకలస చ్ఛక్రాబ్జ పాశోత్పల
వ్రీహ్యగ్రస్వ విషాణరత్న కలశాన్ హస్తైర్వహంతం భజే
గ్రహ పూజలు చేయించుకోవడానికి వేలల్లో ఖర్చులు చేస్తుంటారు. అదేమీ అవసరం లేకుండా ఈ శ్లోకాన్ని 32 సార్లు చదివితే ఎలాంటి గ్రహ బాధల నుంచైనా విముక్తి కలుగుతుంది.
విజయ గణపతి
పాశాంకుశ స్వదంత్రామ ఫలవానాఖు వాహనః
విఘ్నం నిహంతు నస్సర్వం రక్తవర్ణో వినాయకః
ఈ శ్లోకాన్ని కూడా 32 సార్లు జపిస్తుంటే విజయాలన్నీ మీ సొంతమే.
నృత్య గణపతి
పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం
ఈ శ్లోకాన్ని 32 సార్లు చేస్తే మనశాంతి కలుగుతుంది.
ఊర్ధ్వ గణపతి
కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,
దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా
దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే
ఈ శ్లోకాన్ని ఆరాధిస్తే అన్యాయంగా శిక్ష పడితే వెంటనే దాని నుంచి బయటపడచ్చు.