Vastu: ఏ రంగు పర్సులు వాడితే మంచిది?
వాస్తు (vastu) ప్రకారం మనం వాడే పర్సుల (wallet) రంగులను బట్టి సక్సెస్ నిర్ణయించబడుతుందట. మనం ఎక్కడికి వెళ్లినా కూడా వాలెట్ లేదా పర్సును మన వెంటే ఉంచుకుంటాం. అలాంటి వాలెట్‌ని వాస్తు ప్రకారం వాడకపోతే నష్టాలు తప్పవని వాస్తు నిపుణులు అంటున్నారు. అసలు ఎలాంటి రంగులున్న పర్సును ఎంచుకోవాలి?
నలుపు (black)
నలుపు అనగానే చాలా మంది అశుభంగా భవిస్తారు. కానీ నలుపు రంగు పర్సు ఉంటే ధనలాభం ఎక్కువగా ఉంటుందట.
పసుపు (yellow)
పసుపు రంగు శుభానికి సూచకం. పసుపు రంగు పర్సు ఉంటే డబ్బు ఎప్పుడూ మన వెంటే ఉంటుందట. పసుపు రంగు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి. గురువారం నాడు పసుపు రంగు దుస్తులు వేసుకుని విష్ణువు, లక్ష్మీదేవికి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. (vastu)
బ్రౌన్ (brown)
బ్రౌన్ రంగు పర్సు ఉంటే డబ్బును ఎక్కువగా ఆదా చేసుకుంటామట. పర్సులో డబ్బు అస్సలు నిలవకపోతే బ్రౌన్ రంగు పర్సుని కొనుక్కుని చూడండి.
పింక్ (pink)
పింక్ కలర్ పర్సు వల్ల కూడా ధనలాభం బాగానే ఉంటుంది. పింక్ అనేది స్వచ్ఛతకు, సంతోషానికి ప్రతీక. ఇంట్లోని గోడలకు కూడా ఈ పింక్ రంగు వేస్తే పాజిటివిటీ ఉంటుందట.
గ్రీన్ (green)
గ్రీన్ రంగు సక్సెస్‌ని సూచిస్తుంది. గ్రీన్ కలర్ పర్సు మీ దగ్గర ఉంటే.. డబ్బు సంపాదించుకోవడానికి అవసరమయ్యే అవకాశాలను సూచిస్తుందట. ఎందుకంటే గ్రీన్ అంటే ప్రకృతి. మన సక్సెస్‌కు ఆ ప్రకృతి కూడా సాయపడేలా చేస్తుంది. (vastu)