Vastu: ఏ దిక్కున నిద్ర‌పోతే పీడ‌క‌ల‌లు రాకుండా ఉంటాయి?

Vastu: కొంద‌రికి రోజూ పీడ‌క‌ల‌లు వ‌స్తుంటాయి. దాంతో ఉలిక్కిప‌డుతుంటారు. వాస్తు ప‌రంగా చూసుకుంటే వారు నిద్ర‌పోయే దిక్కు కార‌ణంగా కూడా పీడ‌క‌ల‌లు వ‌స్తుంటాయ‌ట‌. అస‌లు పీడ క‌ల‌ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఏ దిక్కున నిద్ర‌పోవాలి?

పీడ క‌ల‌లు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

*ఫిట్క‌రీ (fitkari) ముక్క‌ను మీ దిండు కింద పెట్టుకుని ప‌డుకుంటే పీడ‌క‌ల‌లు రావ‌డం త‌గ్గుతాయి. వారం రోజుల పాటు ఆ ఫిట్క‌రీ ముక్క‌ను దిండు కింద పెట్టుకుని నిద్ర‌పోండి. ఆ త‌ర్వాత దానిని కాల్చేయండి.

*మీ బెడ్‌రూంలో ఎలాంటి రంగుల క‌ర్టెన్లు వాడుతున్నారు అనేది కూడా ముఖ్య‌మే. లేత నీలం రంగు క‌ర్టెన్లు పెట్టుకుంటే మంచిది.

*ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసినా మంచి ఫ‌లితాలు ఉంటాయి.

*మీరు నిద్ర‌పోయే ద‌గ్గ‌ర ఒక రాగి వ‌స్తువును పెట్టుకుని నిద్ర‌పోండి. రాగి పీడ క‌ల‌ల‌ను దూరం చేస్తుందట‌.

*నిద్ర‌పోయేట‌ప్పుడు ఏ దిక్కున దిండె పెట్టుకుని ప‌డుకుంటున్నారో చూసుకోండి. ఉత్త‌రం, తూర్పు దిక్కుల్లో నిద్ర‌పోతే మంచిది.