ఇంట్లో ఎలాంటి పూల మొక్క‌లు పెంచుకుంటే మంచిది?

ఇంట్లో మొక్క‌లు, పూల మొక్క‌లు ఉంటే మ‌న‌సు ఎంతో ప్ర‌శాంతంగా ఉంటుంది అంటారు (vastu). అందుకే ఇంటి బ‌య‌టే కాకుండా ఇంటి లోప‌ల కూడా కుండీలు పెట్టుకుంటూ మొక్కుల‌ను అల్లిస్తారు. వాటిలో ఉన్న పాజిటివిటీ అలాంటిది. అయితే వాస్తు ప్ర‌కారం ఇంట్లో పెట్టుకుంటే మొక్క‌లు కూడా ఉంటాయి. అవి ఏం మొక్క‌ల్లో తెలుసుకుందాం.

లావెండ‌ర్ (lavender)

లావెండ‌ర్ పేరు విన‌గానే ప‌ర్పుల్ రంగులో క‌నిపించే పువ్వులు మ‌న ఆలోచ‌న‌కు వ‌స్తాయి. వాటిని చూస్తేనే ఏదో తెలీని ప్ర‌శాంత‌త ఉంటుంద‌ని ఓ స‌ర్వేలో కొంద‌రు వ్య‌క్తం చేసారట‌. ఇంట్లో లావెండ‌ర్ మొక్క‌ల్ని పెట్టుకోవ‌డం వ‌ల్ల ఎంతో మంచిది.

ఆర్కిడ్స్ (orchids)

ఆర్కిడ్ పువ్వులు ల‌క్‌కి ప్ర‌తీక‌. ఆర్ధికంగా ఎదిగేందుకు నెగిటివిటీని ద‌రిచేర‌నివ్వ‌కుండా చేయ‌డంతో ఆర్కిడ్ కీల‌క పాత్ర పోషిస్తుంది.

డ‌ఫోడిల్ (daffodil)

వాస్తు శాస్త్రం ప్ర‌కారం డ‌ఫోడిల్ పువ్వులు క్ష‌మాగుణానికి ప్ర‌శాంత‌త‌కు ప్ర‌తీక‌గా నిలుస్తాయి. ఈ మొక్క నుంచి అనేక లాభాలు పొందాలంటే దీనిని ఉత్త‌ర దిశ‌లో కానీ ఈశాన్యంలో కానీ పెట్టుకుంటే మంచిది. అయితే డ‌ఫోడిల్ మొక్క‌ను మీరు కొనుక్కోవాల‌నుకుంటే చిన్న మొక్క‌ల‌ను మాత్రం కొనుక్కోవ‌ద్దు. కాస్త పెద్ద మొక్క‌ల‌నే తీసుకోండి. చిన్న మొక్క‌లు తీసుకుంటే ఎదుగుద‌ల కూడా అంతే ఉంటుంద‌ని అంటుంటారు.

మ‌ల్లె పువ్వు (jasmine)

మ‌ల్లె పువ్వులు వెంట‌నే పాజిటివ్ మూడ్‌లోకి మార్చేస్తాయి. చెట్టుకి ఉన్న పువ్వుల నుంచి వ‌చ్చే వాస‌న ఒక ర‌క‌మైన సాంత్వ‌న‌ను క‌లిగిస్తుంది. ద‌క్షిణం వైపు ఏద‌న్నా కిటికీ ఉంటే అక్క‌డ మల్లె మొక్క‌ను అల్లించండి.

ముద్దబంతి (marigold)

ముద్ద‌బంతి శుభానికి సూచ‌కం. అందుకే పండుగ‌లు, పెళ్లిళ్లు, వేడుక‌ల స‌మ‌యంలో ముద్ద బంతి మాల‌ల‌తో అలంక‌రిస్తుంటారు. ముద్ద బంతి పువ్వుల మొక్క‌లు ఇంట్లో పెంచుకోవాలంటే అనువైన స్థ‌లం కూడా ఉండాలి. మీ ఇంట్లో స‌రిపోయేంత స్థ‌లం ఉంటే చక్క‌గా నాటుకోవ‌చ్చు. లేదా ఒక మొక్క‌ను పెద్ద కుండీలో నాటుకుని ఇంటి ప్ర‌ధాన ద్వారం ముందు పెట్టుకుంటే ఎంతో మంచిది.