Vastu: ఇంటి ముందు ఇవి పెడుతున్నారా?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ద్వారం ముందు కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు. వాటి వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇల్లంతా ఎప్పుడూ గందరగోళంగా, సమస్యలు, గొడవలతో ఉంటుంది. అసలు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ద్వారం ముందు ఎలాంటి వస్తువులు పెట్టకూడదో తెలుసుకుందాం. (vastu)
*ఇంటి ద్వారం ముందు చెత్త డబ్బాలు, షూ ర్యాక్‌లు అస్సలు పెట్టకూడదు. ఇంటి ద్వారం ముందు ఎప్పుడూ కూడా మొక్కలు పెట్టుకోవాలి.
*ఇంట్లో ఏవైనా విరిగిపోయిన, పగిలిపోయిన సామాన్లు ఉంటే బయట పడేయచ్చులే అని ఓ కవరులో పెట్టి ఇంటి ద్వారం ముందు పెడుతుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. కావాలంటే అలాంటి సామాన్లను పెరడులో పెట్టేయండి. లేదా చెత్తలో వేసేయండి. అంతేకానీ విరిగిన ఫర్నీచర్ కానీ అద్దాలు కానీ ద్వారం ముందు అస్సలు ఉంచకూడదు. (vastu)
*మొక్కలు పెట్టుకుంటే మంచిది కానీ ఆ మొక్కలకు ముళ్లు లేకుండా ఉంటేనే బెటర్. ముళ్లు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీని సూచిస్తాయి. కావాలంటే ముళ్లు ఉండే క్యాక్టస్, అలోవెరా మొక్కలను మీ ఇంట్లో ఆఫీస్ డెస్క్‌పై పెట్టుకోవచ్చు. అంతేకానీ ద్వారం ముందు మాత్రం అస్సలు వద్దు.
*ద్వారానికి ఆపోజిట్ డైరెక్షన్లో అద్దాలు ఉంచకండి. నెగిటివ్ ఎనర్జీని మన ఇంట్లోకి పంపుతుంది. (vastu)
*మీ ఇంటి ద్వారం ముందు మొక్కలు ఉంటే ఒకసారి వాటిని సరిగ్గా చూసుకుంటూ ఉండండి. ఒకవేళ ఏ మొక్క అయినా చచ్చిపోయినట్లు అనిపిస్తే వెంటనే పీకి పారేయండి. దాని స్థానంలో వేరే మొక్క నాటుకుంటే మంచిది.