Vastu: ఈ చెట్లు ఇంట్లో ఉంటే బ్యాడ్ లక్!
Hyderabad: వాస్తు శాస్త్రం (vastu) ప్రకారం కొన్ని చెట్లు ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు అని చెప్తున్నారు నిపుణులు. వాటిపై ఓ లుక్కేద్దాం.
క్యాక్టస్ (cactus)
ఈ మొక్క ఇంట్లో ఎక్కడ పెట్టినా చూడటానికి అందంగా ఉంటుంది. కానీ క్యాక్టస్‌కి ఉండే ముళ్లు నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయట.
బోన్సాయ్ (bonsai)
పొట్టిగా ఉండే ఈ బోన్సాయ్ చెట్లు చూడటానికి బాగుంటాయి. ఈ మొక్క ఇంట్లో ఉంటే.. ఇది ఎలాగైతే పెరగకుండా పొట్టిగానే ఉంటుందో.. కుటుంబం కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు వాస్తు నిపుణులు.
గోరింటాకు (mehendi)
గోరింటాకు చెట్టుకు ఇంటి బయట నాటుకుని పెంచితే ఏం ఫర్వాలేదు. దీనిని ఇంట్లో పెట్టుకోవడం అంత శుభప్రదం కాదు.
పత్తి మొక్క (cotton plant)
పత్తి మొక్కలు చూడటానికి బాగుంటాయని ఇంట్లో మాత్రం వీటిని అస్సలు పెంచకండి. బ్యాక్ లక్‌కు సంకేతం.
చింత చెట్లు (tamarind)
చింత చెట్లు బయటే ఉండాలి. ఇంట్లో అస్సలు పెంచకండి. చింత చెట్టుపై దెయ్యాలుంటాయన్న కథలు వింటూనే ఉంటాం. ఈ చెట్టు ఇంట్లో ఉంటే నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది.