Vastu: ఈ వస్తువులు కానుకగా ఇస్తే అంతే సంగతులు
Vastu: దానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని కొందరు. మనకు ఎలాగూ పనికి రావు కదా, కనీసం ఇతరులకైనా పనికొస్తాయని ఇంకొందరు తమ దగ్గరున్న చాలా వస్తువులను బయట వారికి దానంగా ఇచ్చేస్తున్నారు. ఎలా ఆలోచించినా ఇది మంచి పనే. కానీ దీని వల్ల కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ దగ్గర దానం తీసుకున్నవారికి మీరు హాని చేస్తున్నారు. అదేంటి దానం చేస్తే హాని చేసినట్టు ఎలా అవుతుంది.. అని ఆలోచిస్తున్నారా.. అదే తెలుసుకుందాం రండి.. (Vastu)
జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం కచ్చితంగా తెలుసుకోవాలనుకునేది జ్యోతిష్య శాస్త్రం. ప్రాచీన కాలం నుంచి పెద్దలు పాటిస్తోన్న జ్యోతిష్య శాస్త్రాన్ని ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకుంటే అసలు సమస్యలే రాకుండా జాగ్రత్తపడొచ్చు. దురదృష్టాన్ని దూరం చేసుకోవాలని కొన్ని వస్తువులను విరాళం లేదా దానంగా ఇచ్చేస్తుంటాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. మనతో పాటు ఉండే వస్తువులే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంటాయి. కాబట్టి కొన్ని వస్తువులను దానంగా కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదని జోతిష్య శాస్త్రం చెబుతోంది. మనం తెలియక చేసినా అవి అందుకున్న వాళ్లకు లేని సమస్యలు తీసుకొచ్చినట్లే అవుతుంది.
ఈ శాస్త్ర నియమాల ప్రకారం.. దానం చేసే ముందు కొన్ని విషయాలను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. మీరు చేసే దానం ఎదుటివారికి చెడు చేయకుండా ఉండాలంటే.. ఏయే వస్తువులు దానం చేయకూడదో తెలుసుకోవడం మంచిది. అవేంటంటే..
ఈ ఐదు విషయాలను గుర్తు గుర్తుపెట్టుకోండి
1. వాడిన చెప్పులు/పాదరక్షలు:
మీ ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ మీరు వాడిన లేదా మీదగ్గరున్న పాత చెప్పులు ఎవ్వరికీ దానం చేయకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి తలరాత అనేది తను వాడే చెప్పలతో ముడిపడి ఉంటుంది. మీరు వాటిని దానం చేయడం వల్ల భవిష్యత్తులో మీరు చెడు పరిమాణాలను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
2. పాత/ చిరిగిన బట్టలు
చాలా మంది తమ దగ్గరున్న పాత బట్టలు లేదా చిరిగిన బట్టలను వేరే వారికి దానంగా ఇస్తుంటారు. నిజానికి పాతవి లేదా లేదా చిరిగిపోయిన బట్టలు నెగిటివ్ ఎనర్జీ కలిగి ఉంటాయి. బయట వారికి వాటిని దానం చేయడం వలన వారిని ఆర్థికంగా నష్టపరిచిన వారు అవుతారు.
3. పగిలిన లేదా విరిగిపోయిన వస్తువులు
బాగు చేయించుకుని వాడుకుంటారులే అని పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను వేరే వారికి దానం చేస్తుంటారు. మీ ఉద్దేశ్యం మంచిదే అయి ఉండొచ్చు. కానీ, జోతిష్య శాస్త్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులు చెడును ఆకర్షిస్తాయి. మీరు వాటిని దానం చేయడం వలన మీకు తెలియకుండానే మీరు వేరే వారికి హాని చేసి పాపం మూట కట్టుకున్న వారు అవుతారు. (Vastu)
4. పదునైన వస్తువులు
దానం చేయడానికి అస్సలు పనికిరాని వాటిలో కత్తులు, కత్తెర లాంటి పదునైన వస్తువులు ముందుంటాయి. ఎందుకంటే ఇవి పూర్తిగా అశుభానికి సూచకాలుగా పెద్దలు భావిస్తుంటారు. ముఖ్యంగా భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యుల మధ్య గల బాంధవ్యాలకు ఇవి అస్సలు మంచివి కావు. ఇవి మనుషుల్లో గల జాలి, కరుణ లాంటి గుణాలను నాశనం చేసి బంధాలను దూరం చేస్తాయి.
5. గడియారాలు
నడుస్తున్న కాలానికి మారుతున్న తలరాతలకు గడియారాలు సూచకాలుగా పనిచేస్తాయి. చేతి వాచీలు లేదా గోడ గడియారాలను వేరే వారికి దానం చేయడం ద్వారా వారి తలరాతను లేదా కాలాన్ని మీరు మార్చే ప్రయత్నం చేసిన వారవుతారని జోతిష్య శాస్త్రం చెబుతోంది. అది మంచైనా కావచ్చు లేదా చెడైనా కావచ్చు. దీనిని బట్టి గడియారాలు దానం చేయదగ్గ వస్తువులు కాదని గుర్తుంచుకొండి. (Vastu)
ఎంతో పక్కాగా ఆచరించదగ్గ జ్యోతిష్య శాస్త్రం సూచిస్తున్న ఈ నియమాలను దృష్టిలో ఉంచుకుంటే ఎటువంటి పొరబాట్లు చేయకుండా ఉంటాం. మొత్తానికి ఇటువంటి వస్తువులను దానం చేయడం మానుకుంటేనే మంచిది.