Vaastu: ఇంటి ముందు ఇవి వద్దు..!
Hyderabad: వాస్తు(vaastu) ప్రకారం కొన్ని వస్తువులను ఇంటి(house) ముందు ఉంచకూడదు అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
అద్దం
ప్రధాన గుమ్మం ఉందు అద్దం ఉంచకూడదు. ఇంట్లోకి రావాల్సిన పాజిటివ్ ఎనర్జీని అద్దం గ్రహించేస్తుందట. ఒకవేళ గ్లాస్ కిటికీలు ఉన్నా కూడా వాటిని కర్టెన్లతో కప్పి ఉంచండి.
పెయింటింగ్స్
మెయిన్ డోర్ ముందు పెయింటింగ్స్ ఉంచకపోవడమే మంచిది. ఒకవేళ ఉంచినా వాటిలో నలుపు రంగు లేకుండా ఉండాలి.
డోర్ హ్యాంగింగ్స్
ప్రధాన ద్వారానికి ఎలాంటి డోర్ హ్యాంగింగ్స్ లేకుండా చూసుకోండి.
చెత్త డబ్బాలు, విరిగిన వస్తువులు
ఇవి ఇంటి ప్రధాన ద్వారం ముందు అస్సలు వద్దు. వాటిని చూస్తేనే మూడ్ పాడవుతుంది.
శుభ్రంగా ఉండాలి
ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడి నుంచే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి అది ఎప్పుడూ క్లీన్‌గా ఉండాలి.
షూ ర్యాక్
ఇంటి ముందు చెప్పుల స్టాండ్, షూ ర్యాక్ ఉంచకూడదు. అది మహా దరిద్రం.
ఎర్ర లైట్లు
బాగా కనిపించాలని ఇంటి ద్వారానికి రైస్ లైట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఏ కలర్ అయినా ఫర్వాలేదు కానీ ఎరుపు మాత్రం వద్దు.
పూలు పూయని మొక్కలు
చెట్లకు పూలుంటేనే అందం. ఇంటి ముందు మొక్కలు పెట్టుకుంటూ పూలు పూయనివాటిని పెట్టుకోకపోవడం మంచిది. తులసి మొక్క మంచిది.