“జీతం 58 లక్షలు.. కానీ సంతోషం లేదు”
Bengaluru: డబ్బు(money) సంతోషాన్ని ఇస్తుంది అని కొందరి మాట. ఎంత డబ్బున్నా(money) సంతోషంగా ఉండటానికి కావాల్సింది డబ్బు కాదు అనేది మరికొందరి మాట. అయితే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూస్తే.. డబ్బుంటే సంతోషం ఉండదు అనేమాటే నిజమేమో అనిపిస్తుంది. ఎందుకో అతని మాటల్లోనే తెలుసుకుందాం. “నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. నాకు 24 ఏళ్లు. పెద్ద కంపెనీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నా. నా జీతం సంవత్సరానికి 58 లక్షలు. అన్నీ ఉన్నాయి. కానీ జీవితంలో సంతోషం మాత్రం లేదు. గర్ల్‌ఫ్రెండ్ లేదు. ఫ్రెండ్స్ ఎవరి జీవితాలతో వారు బిజీగా ఉన్నారు. ఒంటరితనం బాధిస్తోంది. నేను రోజూ చేసే పని కూడా బోర్ కొడుతోంది. ఎందుకంటే రోజూ ఒకే పనిచేస్తుంటా. నా వర్క్ లైఫ్‌లో వేరే ఛాలెంజెస్ ఉండాలని కూడా అనుకోవడంలేదు. నా జీవితం ఇంట్రెస్టింగ్‌గా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. దయచేసి జిమ్‌కి వెళ్లు అని మాత్రం చెప్పద్దు. నేను రోజూ జిమ్‌కి వెళ్తాను” అని పోస్ట్ చేసాడు. దాంతో ఈ పోస్ట్ కాస్తా ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. దాదాపు 800లకు పైగా కామెంట్లు వచ్చాయి. కొందరు సంతోషంగా ఉండటానికి టిప్స్ చెప్తుంటే మరికొందరేమో ఏం చదివితే అంత జీతం ఇచ్చే ఉద్యోగం వస్తుంది అని అడుగుతున్నారు.