Spiritual: పెళ్లి కాని అమ్మాయిలు చేయకూడని పనులు
పెళ్లి కాని అమ్మాయిలు.. వివాహితులు కొన్ని సందర్భాల్లో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి (spiritual). ఇంట్లో ఆడపిల్లలు ఫలానా రోజు జుట్టు కత్తిరించుకుంటాను.. లేదా తలస్నానం చేస్తాను అని చెప్పినప్పుడు ఇంట్లో పెద్దవారు ఈరోజు వద్దు ఈ సమయంలో వద్దు అని చెప్తుంటారు. దాని వెనుక కారణాలు లేకపోలేదు.
పెళ్లికాని ఆడపిల్లలు బుధవారం రోజున తలస్నానం చేయకూడదట. ఇలా చేస్తే ఆ ఇంటికే దరిద్రం అని పురాణాలు చెప్తున్నాయి. అదే పెళ్లి అయిన మహిళలు మంగళవారం, గురువారం, శనివారాల్లో తలంటుకోకూడదట. ఇలా చేస్తే అమ్మవారికి విపరీతమైన కోపం వస్తుంది. వీరు శుక్రవారం రోజున తలస్నానం చేస్తే ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు.
గురువారం రోజున మహిళలే కాదు మగవారు కూడా తల స్నానం చేయకూడదట. గురువారం బృహస్పతికి చెందిన రోజు. ఈ రోజున తల స్నానం చేస్తే ఆర్థిక సమస్యలు తప్పవని నిపుణుల అభిప్రాయం. అంతేకాదు.. గురువారం నాడు జుట్టుకు నూనె పెట్టుకున్నా అరిష్టమే. ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో జుట్టు కత్తిరించుకోవడం వంటికి అస్సలు చేయకూడదు.