Maha Shivaratri: శివరాత్రి మొత్తం చేయలేరా? ఏం ఫర్వాలేదు!
Maha Shivaratri: శివరాత్రి రోజు జాగరణ, అభిషేకం, ఉపవాసం ఇవన్నీ ఆ రోజంతా చేయలేం అనేవారు చాలా మంది ఉంటారు. ఆరోగ్యం కారణంగా కానీ, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇలా పలు రకాల కారణాల వల్ల చేయలేకపోతే.. శివరాత్రి రోజున ఒక్క 40 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే శివరాత్రి మొత్తం చేసిన పుణ్యం వస్తుంది. దీనినే లింగోద్భవ కాలం అంటారు. సామాన్యంగా ఇది అర్ధరాత్రి 12 గంటలకు వస్తుంది. లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడిని అర్చించగలితే శివరాత్రి మొత్తం చేసిన ఫలితం వస్తుంది. లింగోద్భవ కాలం అంటే ఏంటి? ఒకసారి బ్రహ్మ, విష్ణుకి సృష్టికి సంబంధించి ఒక వాగ్వాదం వచ్చి నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు. అప్పుడు ప్రళయం వచ్చి పరమేశ్వరుడు జ్యోతి స్తంభ స్వరూపంలో దర్శనమిచ్చి వారి మధ్య వచ్చిన సమస్యను పరిష్కరించాడు. (Maha Shivaratri)
ALSO READ: Shivaratri: శివుడు ఎలా జన్మించాడు?
ఇది అరుణాచలంలో జరిగింది. ఈ జ్యోతిర్లింగాన్నే అరుణగిరి అంటారు. పరమేశ్వరుడు జ్యోతిర్లింగం కింద ఆవిర్భవించిన సమయమే ఈ లింగోద్భవం. ఆ సమయంలో సృష్టిలో ఉన్న ప్రతీ లింగ స్వరూపంలోనూ పరమేశ్వరుడి శక్తి వ్యక్తం అవుతుంది. శివరాత్రి రోజు ఏది చేసినా చేయకపోయినా లింగోద్భవ సమయాన్ని మాత్రం అస్సలు మిస్సవ్వద్దు. మరేం చేయాలి ఈ సమయంలో? ఈ సమయంలో మీరు కుదిరితే అభిషేకం చేయండి. లింగోద్భవ సమయంలో ఐదు, ఆరు సార్లు అభిషేకం చేస్తే ఎంతో మంచిది. అభిషేకం కుదరకపోతే పరమేశ్వరుడి ధ్యానం చేయండి. ఎలా ధ్యానం చేయాలి? దీనికి ఒక టెక్నిక్ ఉంది.
ప్రపంచం మొత్తం పాతాళం నుంచి ఆకాశం వరకు ఒక పెద్ద శివలింగంలా భావించుకోండి. శివుని తలపై చంద్రుడు ఉంటాడు కదా.. ఆ చంద్రుడి నుంచి అభిషేకం చేస్తున్నట్లు ధ్యానించండి. అలా ధ్యానిస్తున్నప్పుడు విచిత్రం ఏంటంటే.. విశ్వమంతా ఒక శివ లింగం అనుకోండి.. మనం కూడా అందులోనే ఉన్నాం అనే భావన కలుగుతుంది. అప్పుడు శివుని తలపై ఉన్న చంద్రుడి నుంచి కురుస్తున్న అమృతధార మనల్ని తడుపుతూ కింద వరకు ధారగా ప్రవహిస్తుంది. దీనినే ధ్యానం అంటారు. దీనికి ఎంతో విశిష్టత ఉంది. ఇది నిష్ఠగా ధ్యానం చేసేవారికి తెలుస్తుంది. ఇలా ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
ALSO READ: Shivaratri: శివరాత్రి రోజున ఇలా చేస్తే పాప రాశి దగ్ధమే..!