Zelensky: నాకు మిస్సైల్స్ ఇస్తారా.. ర‌ష్యాని ఏసేస్తా

Zelensky discussed victory plan with NATO chief Mark Rutte

Zelensky: ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ నిన్న నాటో చీఫ్ మార్క్ ర‌ట్టే, బ్రిట‌న్ ప్ర‌ధాని కీర్ స్మార్మ‌ర్‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ర‌ష్యాపై యుద్ధం గెలిచే ప్లాన్ త‌న ద‌గ్గ‌ర ఉందంటూ వారికి ప్రజెంటేష‌న్ వేసి చూపించారు. ఈ నేప‌థ్యంలో బ్రిట‌న్ నుంచి త‌న‌కు మిస్సైల్ సాయం చేస్తే ర‌ష్యాను వేసేస్తాన‌ని స్మార్ట‌ర్‌ను అభ్య‌ర్ధించారు. అమెరికా, బ్రిట‌న్ క‌లిసి త‌న‌కు మిస్సైల్ సాయం చేస్తే త‌న ప‌ని మ‌రింత సులువు అవుతుంద‌ని అన్నారు. అయితే ఈ అంశంపై నిర్ణ‌యం పూర్తిగా అమెరికా, బ్రిట‌న్ దేశాలే తీసుకోవాల‌ని నాటో చీఫ్ మార్క్ ర‌ట్టే అన్నారు.

మ‌రోప‌క్క ఏ ప‌శ్చిమ దేశాలైనా ఉక్రెయిన్‌కు ఆయుధాలు, మిస్సైల్స్ ఇచ్చి సాయం చేసిన‌ట్లు తెలిస్తే మూడో ప్ర‌పంచ యుద్ధం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఈ ప్లాన్ గురించి జ‌ర్మ‌నీకి చెందిన మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి జెలెన్‌స్కీ ఓ స‌మ్మిట్‌లో వివ‌రించాల్సి ఉంది. కానీ అమెరికాలో మిల్ట‌న్ హ‌రికేన్ బీభ‌త్సం సృష్టిస్తున్న నేప‌థ్యంలో ఆ దేశ అధ్య‌క్షుడు జో బైడెన్ స‌మ్మిట్ క్యాన్సిల్ చేసారు. దాంతో జెలెన్‌స్కీ ముందు బ్రిట‌న్‌కు త‌న ప్లాన్ గురించి చెప్పారు. త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ జెలెన్‌స్కీ కొన్ని రోజులుగా యూరోపియ‌న్ దేశాల్లో ర్యాలీ చేప‌డుతున్నారు. ఈరోజు ఆయ‌న పోప్ ఫ్రాన్సిస్‌ను క‌ల‌వ‌నున్నారు.