55 శాతం ఓటు షేర్.. జ‌గ‌న్ కాన్ఫిడెన్స్‌కి కార‌ణం ఏంటి?

ysrcp to get 56 percent vote share in ap elections

AP Elections:  మొన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన పోలింగ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 55 శాతం ఓటు షేర్ వ‌స్తుంద‌ని.. క‌చ్చితంగా 150 సీట్లు గెలుస్తామ‌ని జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి అన్నారు. మొన్న ఐప్యాక్ కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన జ‌గ‌న్.. ఈ వ్యాఖ్య‌లు చేసారు. అయితే 150 సీట్లు గెలిచి తీర‌తామ‌ని జ‌గ‌న్ ఇంత కాన్ఫిడెన్స్‌గా ఎలా చెప్పారు? అలా చెప్ప‌డం వెనుక ఉన్న కార‌ణం ఏంటి?

ఆయన అలా చెప్ప‌డానికి కార‌ణం ఐప్యాక్ సంస్థ ఓ యాప్ ద్వారా చేయించిన స‌ర్వేనే అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పోలింగ్ రోజున ఐప్యాక్ సంస్థ ఓ యాప్ ద్వారా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1700 మంది నుంచి సర్వే తీసుకున్నార‌ట‌. ఆ స‌ర్వే ప్ర‌కారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 55% ఓటు షేర్ ఉంద‌ని తేలింద‌ట‌. ఈ విష‌యాన్ని ఐప్యాక్ సంస్థ జ‌గ‌న్‌కు చెప్ప‌డం వ‌ల్లే ఆయ‌న అంత ధీమాగా గెలుపు మాదే అంటున్నార‌ని టాక్.

2023లో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో కూడా ఐప్యాక్ ఈ యాప్ ద్వారానే స‌ర్వే చేయించింది. ఆ స‌ర్వేలో 65 నుంచి 70 సీట్లు కాంగ్రెస్‌కి వ‌స్తాయ‌ని తెలిసింద‌ట‌. ఆ త‌ర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతో ఆ యాప్ ద్వారానే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌ర్వే చేయించిన‌ట్లు స‌మాచారం.