BJP: ఆ రెండు బిల్లులకు YSRCP సపోర్ట్
Delhi: YSRCP ప్రభుత్వం ముందు నుంచీ BJPకి సపోర్ట్ చేస్తూనే వస్తోంది. ఇప్పుడు కూడా BJP YSRCP సపోర్ట్‌తోనే పార్లమెంట్లో రెండు బిల్లులపై విజయం సాధించనుంది. ఒకటి.. అపోజిషన్ కూటమి (I-N-D-I-A) ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (no confidence motion), రెండోది దిల్లీ ఆర్డినెన్స్ (delhi ordinance) బిల్లు. ఈ రెండు సమస్యలపై జగన్ BJPకే సపోర్ట్ చేస్తుందని YCP సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి (vijay sai reddy) మీడియా ద్వారా వెల్లడించారు.
YSRCP ప్రభుత్వానికి లోక్ సభలో 22 మంది సభ్యులు, రాజ్య సభలో 9 మంది సభ్యులు ఉన్నారు. గతంలోనూ ఎన్నో క్లిష్టమైన బిల్లులు ప్రవేశపెడితే YCP BJPకే సపోర్ట్ చేసింది. దిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై BJP రాజ్యసభలో గెలవాలంటే కష్టమే. అదే YCP సభ్యులు సపోర్ట్ చేస్తే మాత్రం గెలవడం చాలా ఈజీ. ఇక మణిపూర్ ఘర్షణపై (manipur violence) పోరాడేందుకు అపోజిషన్ కూటమి I-N-D-I-A.. BJPకి వ్యతిరేకింగా పాస్ చేసిన అవిశ్వాస తీర్మానాన్ని (no confidence motion) YSRCP వ్యతిరేకిస్తోందని YCP నేత విజయ్ సాయి రెడ్డి (vijay sai reddy) క్లారిటీ ఇచ్చేసారు. దేశంలో అంతా బాగానే ఉన్నప్పుడు ఈ పరీక్ష దేనికని ప్రశ్నించారు. సో.. ఈ రెండు క్లిష్టమైన బిల్లులకు YCP ప్రభుత్వం సపోర్ట్‌తో BJP తమ బలాన్ని రుజువు చేసుకోనుంది.