Shyamala: మోక్షజ్ఞ సినిమాలో హీరోయిన్ ఉంటుందా?
Shyamala: సినిమాల్లో పనిచేసిన ఆడవాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా అంటూ ప్రెస్ మీట్ పెట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి శ్యామల. తాను ఒకప్పుడు యాంకర్‌గా, నటిగా ఉన్నానని ఈరోజు తెలుగు దేశం, జనసేన పార్టీ వారు తన పట్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో హోంమంత్రి స్వయాన ఒక ఆడది అయ్యుండి.. ఈరోజు ఆడపిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోలేకపోతున్నారని.. కనీసం నిందితులను శిక్షించలేకపోతున్నారని అన్నారు.
“” జగన్ మోహన్ రెడ్డి గారు నన్ను ప్రజాప్రతినిధిగా ప్రకటించినప్పటి నుంచి నన్ను మానసికంగా కుంగదీసేందుకు తెలుగు దేశం పార్టీ తెగ ప్రయత్నించింది. నా నెంబర్‌ను పబ్లిక్ ప్లాట్‌ఫాంలో పెట్టేసి లం*** శృంగార రసిక అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే బాధ్యత. నేను నటిగా ఉన్నప్పుడు వేసిన డ్యాన్సులను, ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ట్వీట్స్ పోస్ట్‌లు చేయించేది మీరు కాదా? ఇవన్నీ మీకు తెలీకుండానే జరుగుతున్నాయా? సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రాకూడదా? పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రాలేదా? ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడు. మరి మోహజ్ఞ సినిమాల్లో హీరోయిన్ని పెట్టరా? మీ పార్టీలో సీనియర్ హీరోయిన్లు జయసుధ, జయప్రద, కవితలు కూడా ఉన్నారు కదా. అంటే మీ పార్టీలో ఎవరైనా చేరచ్చు. కానీ ఇతర పార్టీలో మాత్రం సినిమా రంగానికి చెందిన ఆడవాళ్లు చేరకూడదా? ఇదేం న్యాయం“” అంటూ మండిపడ్డారు శ్యామల.