YSRCP టీం నుంచి తొలి అరెస్ట్
YSRCP: సోషల్ మీడియా టీం నుంచి తొలి అరెస్ట్ నమోదైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితపై వర్రా రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెట్టాడు. నిన్ను వదలనురా నా కొడకా అంటూ ఇటీవల అనిత వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రవీంద్ర రెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి కదిరి వెళ్తున్న సమయంలో వర్రాని పోలీసులు కాపు కాసి అరెస్ట్ చేసారు.