Duvvada Srinivas: దువ్వాడ‌పై YSRCP పెద్ద‌లు సీరియ‌స్

ysrcp Serious On Duvvada Srinivas Family Issue

Duvvada Srinivas: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన టెక్క‌లి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గుట్టు ర‌చ్చ‌కెక్క‌డంతో పార్టీ పెద్ద‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లే విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఒక ఎమ్మెల్సీ అయ్యుండి ఏంటీ ర‌చ్చ అని పెద్ద‌లు దువ్వాడ‌తో ఫోన్ ద్వారా సంభాషించార‌ట‌. ఇది వ్య‌క్తిగ‌త కుటుంబ గొడ‌వ కావ‌డంతో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దీని గురించి ఏమీ మాట్లాడ‌లేక‌పోతున్నార‌ని.. రెండు రోజుల్లో మ్యాట‌ర్ సెటిల్ చేస్తే బెట‌ర్ అని హెచ్చ‌రించార‌ట‌. దువ్వాడ ఫ్యామిలీ పంచాయ‌తీ గ‌తంలో జ‌గ‌న్ వ‌ద్దకు వెళ్లింది. దీనిని తాను ప‌రిష్క‌రించ‌లేన‌ని త్వ‌ర‌గా సెటిల్ చేసుకోవాల‌ని అప్పుడే జ‌గ‌న్ దువ్వాడ శ్రీనివాస్‌కు అత‌ని భార్య దువ్వాడ వాణికి చెప్పార‌ట‌.